తక్కువ వినియోగం, ఎక్కువ ఆదా!

నేడు పొదుపు దినోత్సవం

Savings Day
Savings Day

ప్రతి సంవత్సరం అక్టోబరు 31న ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి అంతర్జా తీయ పొదుపు కాంగ్రెస్‌ 1924లో ఇటలీలోని మిలన్‌లో జరిగింది.

అక్టోబర్‌ 31ను ప్రపంచ పొదుపు దినంగా ప్రకటించే తీర్మానాన్ని కాంగ్రెస్‌ ఆమోదించింది. కానీ మన భారతదేశంలో అక్టోబరు 30న జరుపుకుంటారు.

పొదుపు పట్ల ప్రజల ప్రవర్త ననుమార్చడం, సంపద ప్రాముఖ్యతను నిరంతరం గుర్తు చేయడం ద్వారా వ్యక్తులు, దేశాల మొత్తం పొదుపు, ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం దీని లక్ష్యం.

ఒక దేశం ఆర్థిక పురోగతికి పొదుపు ముఖ్యం. ఎందుకంటే పొదుపుతోనే పెట్టుబడి సాధ్యమవుతుంది.

మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక సమాజం మూలధనంలో ఎక్కువ పెట్టుబడి కోసం తక్కువ వినియోగం, ఎక్కువ ఆదా చేయాలి.

భవిష్యత్తులో అధిక వినియోగాన్ని ఆస్వాదించడానికి ప్రస్తుతం వస్తువుల, సేవల వినియోగాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉంది.

డబ్బును ఆదా చేయడం ద్వారా ఆర్థికంగా, స్వతంత్రంగా ప్రయోజనాలు లభిస్తాయి. ఏదైనా వూహించని ఖర్చులతో బాధపడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే బాధపడవలసిన పరిస్థితి ఉండదు. పదవీ విరమణలో కూడా మరింత సౌకర్యంగా ఉంటుంది.

పొదుపు ఎక్కువైతే ఆర్థిక కార్యకలాపాలకు హానికరం కూడా. వస్తువులు, సేవలకు సమిష్టి డిమాండ్‌ బలహీనపడుతుంది. ఒక విషవలయంగా మారే ప్రమాదం ఉంది.

దీనితో ప్రజల విశ్వాసం క్షీణించి వారు తక్కువ ఖర్చు చేయడం జరిగి ఆర్థిక కార్య కలాపాలను మరింత తగ్గిస్తుంది. చాలా మంది ఆర్థికవేత్తలు పొదుపు అనేది వ్యక్తిగత ధర్మం అని నమ్ముతారు.

కాని సామాజికపరంగా ప్రజలందరూ పొదుపు చేయడం ప్రారంభిస్తే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుత వ్యవస్థ వ్యయం ఆధారంగా జిడిపి, ఆర్థిక వృద్ధిని కొలుస్తుంది.

కాబట్టి అధిక పొదుపు రేటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది.ప్రపంచంలోనే దేశ స్థూల జాతీయ ఉత్పతి (జిడిపి)లో 65.9 శాతం పొదుపుతో మొదటి ర్యాంకు ను ఆక్రమించింది.

ఐర్లాండ్‌ 56.3శాతం పొదుపుతో రెండవ ర్యాంకుతో ఉంది.

సింగపూర్‌ 53.5 శాతం పొదుపుతోమూడవ ర్యాంకును పొందింది.

ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఒఇసిడి) నుండి వచ్చిన కొత్త విశ్లేషణ ప్రకారం వచ్చే ఏడాది గృహ పొదుపు సూచనలను పరిశీలిస్తే, లక్సెంబర్గ్‌ శాతం పొదుపులో అగ్రస్థానంలో ఉంది.

లక్సెంబర్గ్‌లోని గృహాలు వచ్చే ఏడాది సగటున 7,103 డాలర్లు ఆదా అవ్ఞతాయని అంచనా.

లిథువే నియన్‌ గృహపొదుపు చివరి స్థానం ఉంది. 2020లో అమెరికా కుటుంబాలు వారి ఆదాయంలో 6.88 శాతం ఆదాఅవ్ఞతాయని అంచనా.

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రకారం ఆఫ్రికాలో జిడిపిలో 17 శాతం పొదుపు రేట్లు సగటున ఉండగా మధ్య ఆదాయ దేశాలు 31 శాతం పొదుపుతో ఉన్నవి.

ప్రపంచ బ్యాంకు అధికారిక అభివృద్ధి సూచికల సేకరణ ప్రకారం భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపిలో)2019లో పొదుపు 27.99 శాతంగా నమోదైంది.

మార్చి 2019తో ముగిసిన సంవత్సరంలో జిడిపిలో ఒక శాతం బ్యాంకు డిపాజిట్లలో గృహ పొదుపులు 3.8 శాతంగా ఉండగా, 2020 మార్చిలో ఇది 3.4 శాతానికి తగ్గింది.

రిజర్వుబ్యాంకు రెపో రేటును గణనీయంగా తగ్గించిన తరువాత బ్యాంకులు తమ వడ్డీరేటును తగ్గించాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం భారతదేశ స్థూల పొదుపు రేటు 2019 మార్చిలో 30.1 శాతం అంతకు ముందు సంవత్సరంలో ఇది 32.4 శాతం ఇండియా స్థూల పొదుపు రేటు సగటు రేటు 18.6 శాతం.

గ్లోబల్‌ డెవలప్‌ మెంట్‌ హారిజన్స్‌(జిడిహెచ్‌) నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా, భారతదేశం అతిపెద్ద పెట్టుబడి దారులుగా మారనున్నాయి.

ఇరు దేశాలు కలిసి 2030లో ప్రపంచ స్థూల పెట్టుబడులలో 38 శాతం ప్రాతినిధ్యం వహి స్తాయి. అంతేకాక మొత్తం ప్రపంచ ఉత్పాదక పెట్టుబడులలో సగం వాటాను కలిగి ఉంటాయి.

మన పొదుపు సామర్థ్యాన్ని కింది కార్యకలాపాలను అనుసరించడం ద్వారా బలోపేతం చేయవచ్చు. నెలవారీ పొదుపు అలవాటుగా చేసుకోవడం, ఇది ఆర్థిక భవిష్యత్తుకు సహాయపడుతుంది.

బడ్జెట్‌లో పొదుపునకు ప్రాధాన్యతనివ్వండి.

పొదుపు ఖాతాలో ఎవరి జోక్యం లేకుండా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వనరులను ఉపయో గించడంకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇప్పటికీ మనం తక్కువ పొదుపుతో వెనుకబడి ఉన్నాం.

ప్రజలలో అవగాహన తీసుకురావడం, దేశంలోని ఆర్థికాభివృద్ధికి,అభివృద్ధికి సహాయపడే ఎక్కువ ఆదా చేయడానికి, ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి చాలా చర్యలు తీసుకోవాలి.

ఇందుకోసం ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సాధికారిత సంస్థలు, స్వయం సహాయక బృందాలు ప్రభుత్వానికి సహకరించాలి.

  • డాక్టర్‌ పి.ఎస్‌.చారి

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/