ఖమ్మంలో హోరెత్తించిన సేవ్‌ ఆర్టీసి ర్యాలీ

save RTC rally
Save RTC rally

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఆర్టీసి కార్మికులు సేవ్‌ ఆర్టీసి పేరున భారీ ర్యాలీ నిర్వహించారు. సేవ్‌ ఆర్టీసి ర్యాలీలో భాగంగా కార్మికులు, విపక్ష నేతలు డిపో నుంచి బస్టాండ్‌కు ర్యాలీగా చేరుకోవడంతో ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన వారిలోని కొందరు నిరసన కారులు బస్సు టైర్లలో గాలి తీయడం, అద్దాలను ధ్వంసం చేశారు. తాత్కాలిక సిబ్బందిపైనా దాడికి చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. కార్మికుల నినాదాలతో ఖమ్మం బస్టాండ్‌ ఆవరణ హోరెత్తిపోయి తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. అతేకాకుండా అధిక ఛార్జీలను తాత్కాలిక సిబ్బంది వసూలు చేస్తున్నారంటూ ఇదే సమయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం రణగొణగా మారింది. పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి పరిస్థితిని కట్టడి చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports