సౌదీ రాజు పాక్‌ పర్యటన కాస్త ఆలస్యం

Saudi  Prince Mohammad bin Salman'
Saudi Prince Mohammad bin Salman’

ఇస్లామాబాద్‌: సౌదీ ఆరేబియా రాజు మహామ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేడు, రేపు రెండు రోజుల పాటు పాకిస్థాన్‌లో పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన కాస్త ఆలస్యమైంది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన ఆయన విదేశీ పర్యటన ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనుందని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ రాజు వెంట పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. పర్యటనలో మార్పులు, ఆలస్యంపై పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే వారం సౌదీ రాజు తమ దేశ వ్యాపార ప్రతినిధులతో భారత్‌కు రానున్నారు.