పాకిస్థాన్‌కు రుణం, చమురు సరఫరా నిలిపేసిన సౌదీ

Imran-Khan
Imran-Khan

లండన్‌: పాకిస్థాన్‌కు రుణం, రుణంపై చమురు సరఫరాను సౌదీ అరేబియా నిలిపివేసింది. దశాబ్దకాలంగా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ముగింపు పలికింది. కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని సౌదీ అరేబియా సారథ్యంలోని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ (ఓఐసీ)ని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ నిర్మొహమాటంగా హెచ్చరించారు. కశ్మీరీలకు మద్దతుగా ఓఐసీ సమావేశం సౌదీ ఏర్పాటు చేయకుంటే ఇస్లామిక్‌ దేశాలతో సమావేశం ఏర్పాటు చేయాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కోరతానని ఖురేషీ చెప్పారు. దీంతో పాక్‌తో స్నేహాన్ని సౌదీ తెగదెంపులు చేసుకున్నది.

తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/