ప్రధాని మోడీ తో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సమావేశం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..భారత ప్రధాని మోడీ తో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు అంశాల ఫై మాట్లాడినట్లు సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రధాని మోడీతో సమావేశం స్ఫూర్తిదాయకమని, అంతర్దృష్టితో కూడుకున్నదిగా పేర్కొన్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా నడిచే స్థిరమైన సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం లోతైన దృష్టిని ప్రశంసించారు. ‘డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉంది. డిజిటల్ ఇండియా విజన్‌ను గ్రహించి ప్రపంచానికి వెలుగుగా ఉండటంలో భారతదేశానికి సహాయం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము’ అని నాదెళ్ల ట్వీట్ ద్వారా కీలక ప్రకటన చేశారు.

సాంకేతికత, ఆర్థిక వృద్ధి, సాధికారత తదితర విషయాల గురించి వీరి ఇరువురు చర్చించారు. భారతదేశానికి అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని తెలిపారు. డిజిటల్‌ అభివృద్ధి విషయంలో భారత్‌కు అన్ని విధాలా సహకరించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని వివరించారు.