జోరందుకుంటున్న సట్టాబెట్టింగ్‌!

ముంబయి : లోక్‌సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపరంగా సట్టామార్కెట్‌ ర్యాలీతీస్తోంది. పుల్వామా ఉగ్రదాడితర్వాత భారత్‌ అనుసరించిన వ్యూహాత్మక వైఖరి, బాలాకోట్‌ జైషేఉగ్రస్థావరం ధ్వంసం వంటి అంశాలపై లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు భారీ విజయంతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తాయన్న పోటీ ఎక్కువయింది. అనధికారిక జూదంగా భావించే సట్టా ఇపుడు దేశవ్యాప్తంగా కీలక మెట్రోనగరాల్లో ఊపందుకుంది. బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందన్న ట్యాగ్‌లైన్‌తో సట్టా మార్కెట్‌ భారీ ఎత్తున పందాలకు రెచ్చగొడుతున్నది. పుల్వామా దాడికి ముందు 200-230 స్థానాలు వస్తాయని అంచనాలువేస్తునఆనరు. ప్రతి రూపాయి పందేనికి ఒకరూపాయి ఇస్తామన్న సవాల్‌తో ఇపుడు 245నుంచి 251స్థానాలు విధిగా గెలుస్తుందని, పార్టీ ఎన్‌డిఎపరంగా 300స్థానాలకు పైబడి గెలుస్తుందని వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 200 లేదా మరినిన స్థానాలు గెలుస్తుందన్న వాదనపై ప్రతి రూపాయి బెట్టింగ్‌కు ఏడు రూపాయలు ఇస్తామని ఆఫర్లు పెంచుతున్నారు. ఇపుడు పుల్వామా దాడితర్వాత ఏకంగా ఎన్‌డిఎ పక్షానికి ప్రతి రూపాయి బెట్డింగ్‌కు పదిరూపాయలు ఇస్తామన్న డిమాండ్‌ప ఎంచారు. ఎన్నికల తేదీలు వెలువడేంతవరకూ ఈ పోటీ కొంత తక్కువగానే ఉంది. తర్వాత క్రమేపీ పుంజుకుంది. లోక్‌సభ ఎ న్నికలు ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ మధ్య ఏడుదశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 23వ తేదీ ఓట్లలెక్కింపుతో ఫలితాలు వెలువడనున్నాయి. ఉగ్రవాదం నియంత్రణలో వైమానిక దాడితర్వాత ప్రభుత్వ ప్రతిష్టపెరిగిందని, ఖచ్చితంగా బిజెపియే రావాలని దేశంలో అత్యధికశాతం కోరుతున్నారని చెపుతూ పందెం రాయుళ్లు మరింతగా మొత్తాలను పెంచేసారు. ఎన్నికల వ్యాపారానికి రాజస్థాన్‌లోని ఫలోడి పట్టణం కేంద్రంగా నిలుస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇతర మేజర్‌మ ఆర్కెట్లకు హబ్‌గా నిలుస్తోంది. ముంబయి, ఢిల్లీ నగరాల ట్రేడింగ్‌నుసైతం రాజస్థాన్‌ప ర్యవేక్షిస్తుందంటే ఎంత జోరుగా సాగుతుందో తెలుస్తున్నది. బుకీలు ఇపుడు 300 ప్లస్‌స్థానాలు ఎన్‌డిఎ గెలుస్తుందన్న పందేలను జోరుగా కాసారు. డ్రేర్లు, రైతులు ఈసారి ఓట్లలోకీలకం అవుతారని అంచనాలున్నాయి. వర్తకులు ఎన్‌డిఎ విధానాలవల్ల కొంతమేర సమస్యలు ఎదుర్కొనఆనరు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలుద్వారా సమస్యలుత్పన్నం అయ్యాయని వాదిస్తున్నారు. ఇక ప్రధాన పంటలకు ధరలు తక్కువగారావడం అస్తవ్యస్త కొనుగోళ్లు కొన్ని ఉత్పత్తులను మాత్రమే కొనుగోళ్లుచేయడం వంటి వవ్యవసాయరంగంలో అసహనాన్ని పెంచాయి. కాంగ్రెస్‌ప్రధానమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తే సీట్లపరంగా కొంత సమతుల్యత చేసుకునే వీలుంటుంది. ప్రియాంక గాంధీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన పక్షంలో కాంగ్రెస్‌ వైపునకు కొంత వస్తారన్నది అంచనా.


https://www.vaartha.com/news/national/
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: