ఎవరూ ఊహించని ట్విస్ట్

Sarvanand New Movie Look
Sarvanand New Movie Look

శర్వానంద్ కొత్త సినిమా రణరంగం ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. టైటిల్ కూడా దీంతో పాటే అనౌన్స్ చేశారు. దీని తాలూకు అప్ డేట్ కొన్ని గంటల క్రితమే తుపాకీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక లుక్ విషయానికి వస్తే  చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ లెక్కన శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఎదిగి తన జీవితంలోని కీలక దశలను ఎలా దాటాడు అనే దాని మీద రణరంగం ఉండబోతోందనే క్లారిటీ వచ్చినట్టే.
ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడు