‘అద్దె మాతృత్వం’పై నిషేధం

Sarogasi
Sarogasi

‘అద్దె మాతృత్వం’పై నిషేధం

‘సరొగసీ వెనుక వాణిజ్యం!
అందుకే ప్రభుత్వం చర్యలు

న్యూఢిల్లీ: అద్దె మాతృత్వంలో వాణిజ్యపద్దతులను నిషే ధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆరోగ్యమంత్రి జెపినడ్డాప్రవేశపెట్టిన బిల్లును పలువురుసభ్యులు చర్చకు లేవనెత్తిన తర్వా త పలు సందేహాలు సవరణలు చేయాలని సూచించారు.

అద్దెగర్భధారణ (సరోగసీ) రానురాను దేశంలో వాణిజ్యీకరణ అవుతున్న సంగతి తెలిసిం దే. నిర్దిష్టమైన విదివిధానాలనురూపొందిస్తూ కృత్రిమ గర్భధారణలో అద్దెమాతృత్వాన్ని వాణిజ్యపరంచేయడాన్ని తమ ప్రభుత్వం ఎంతమాత్రం అనుమతించబోదని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. ఒక కుటుంబం అంటే ఒక మహిళ,పురుషులు చట్టపరంగా వివాహం చేసుకున్నవారిగా గుర్తిస్తు న్నట్లు వెల్లడించారు. ఐతే ఒకేజాతికి చెందిన ఇద్దరు వివాహం చేసుకుంటే అంటే స్వలింగ సంపర్కులపరంగా ఏంచేయాలని కొందరుసభ్యులు ప్రశ్న లు లేవనెత్తారు. అలాగే సహజీవనం చేస్తున్న జంటలపరంగా ఈ బిల్లులో నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఏమీలేవని వారికి ఉన్న సౌలభ్యాలేమిటో స్ప ష్టం చేయాలని సభ్యులుపలువురుకోరారు.

డాక్టర్‌గోష్‌ ఇచ్చిన సలహాలు, సూచనలను నియమనిబంధనలు రూపొందించే సమయంలో పరిగణ నలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి సభకు హామీ ఇచ్చారు. ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే జోక్యం చేసుకుంటూ ఆరోగ్యమంత్రి కుటుం బానికి ఇచ్చిన నిర్వచనంపై అభ్యంతరం వ్యక్తంచేసారు. కేవలం ఈ బిల్లు పరంగా మాత్రమే ఈ నిర్వచనం ఇచ్చినట్లు మంత్రి వివరించారు. ఒడిశా ఎంపి బి.మెహతాబ్‌ మాట్లాడుతూ ఆరోగ్యమంత్రిత్వశాఖ చట్టపరమైన అంవాలను మాత్రమేక్రమబదీకదకరిస్తోందని పేర్కొన్నారు. ఇక సరోగస ీకాకుండా జన్మించినపిల్లలకు చట్టపరమైన రక్షణఉండాలని, వారిపై ఎలాం టి వివక్ష ఉండకుండాచూడాలని కోరారు. అంతేకాకుండా ఈ బిల్లులో వాణిజ్యపరమైన అద్దెగర్భదారణ, నైతిక గర్భధారణలమధ్య తేడాలను స్పష్టం చేయలేకపోయిందని అన్నారు.

ఈ బిల్లు అమలుకుతేవడం మంచి పరిణామమేనని తాను మద్దతిస్తున్నట్లు ప్రేమదాస వెల్లడించారు. ఆప్‌కు చెందిన ధర్మవీర్‌గాంధీ మాట్లాడుతూ ప్రవాసభారతీయులకు, విదేశీయు లకు ఈ సేవలు అందేటట్లు అనుమతించాలని చెపుతూ తాను బిల్లుకు మద్దతిస్తున్నట్లు వెల్లడించారు.

జెడియుకుచెందిన కౌశలేంద్రకుమార్‌ మాట్లాడుతూ అభివృద్ధిచెందిన దేశాల్లోకూడా సరోగసీ క్రమబద్దీకరణకు చట్టాలను అమలుచేస్తున్నాయని, అద్దెగర్భధారణ అవసరమనుకున్న దంపతుల శ్రేయస్సునుసైతంపరిరక్షించాలని కోరారు. అద్దెగర్భధారణకు సంబంధించి సంబంధిత దంపతుల సమీపబంధువే గర్భధారణకు అంగీక రించి సొమ్ములు తీసుకున్నపక్షంలో ఎవరిని శిక్షిస్తారని బిల్లు అమలుకు తేవడం మంచి ఉద్దేశ్యమేకాని ఎక్కువ దుర్వినియోగంజరుగుతుందని మార్గదర్శకాల రూపకల్పనలో జాగ్రత్తలు పాటించాలని టిఆర్‌ఎస్‌ ఎంపి డా.బిఎన్‌గౌడ్‌ వెల్లడించారు.

డాక్టర్‌గౌడ్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ శస్త్రచికిత్సల నిపుణులు కావడంతో ఆయన సరోగసీపై తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పగలిగారు. ఎన్‌సిపిఎంపి సుప్రియా సూలే మాట్లాడుతూ ఐదేళ్లపాటు వేచి ఉన్న అనంతరం ఈ వాణిజ్యపద్దతుత్లో గర్భధారణకు రావాలన్న నిబంధన మార్చాలని సూచించారు.

శాస్త్రీయంగా వారికి గర్భధారణ సమస్యలున్నట్లు నిర్ధారణ కావాలన్నది మంచిదేకానీ ఐదేళ్లకాలపరిమితి నిర్ణయించడాన్ని సడలించాలని కోరారు. ఇద్దరుమాత్రమే ఉన్న తల్లితం డ్రులు చిన్నపిల్లలను దత్తత తీసుకోవచ్చని, అలాంటి వారికి అద్దెకు కృత్రి మ గర్భదారణ ఎందుకు అనుమతించకూడదని ఆమెప్రశ్నించారు. ఈ బిల్లు అమలుకు రావడంమంచిదేకానీ బిల్లులో ఆధునికత కొరవడిందని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో చర్చల అనంతరం వాణిజ్యపరంగా అద్దె మాతృత్వ వినియోగాన్ని నిషేధించేందుకు నిర్దేశించిన ఈబిల్లుకు లోక్‌సభ లో ఆమోదం లభించింది. పార్లమెంటు శీతాకాలసమావేశాలు ప్రారంభ మైన ఏడోరోజు కూడా నిరసనలు కొనసాగాయి.

రాఫెల్‌డీల్‌పై జాయింట్‌ పార్లమెంటరీకమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వంమరోసారి తిరస్కరించింది. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఇదే తీరు కొనసాగింది. లోక్‌సభలో వినియోగదారుల వ్యవహారాలశాఖమంత్రిరామ్‌విలాస్‌పాశ్వాన్‌ వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2018ని ప్రవేశపెట్టారు.

ఐతే సభ్యుల నిరసనలు ఎక్కువ కావడం తో ఈబిల్లును గురువారం చర్చకు స్వీకరిస్తామని స్పీకర్‌ వెల్లడించారు. మేకధాతుప్రాజెక్టునిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అనుమతిం చడంపై తమిళనాడు ఎఐఎడిఎంకెసభ్యులు, రాఫెల్‌డీల్‌పై కాంగ్రెస్‌, ఇతరపక్షాలుజెపిసికి పట్టుబట్టాయి. సరోగసి బిల్లుపై చర్చలో మాత్రం ఎఐఎడిఎంకెసభ్యులు పాల్గొనలేదు. అలాగే సరోగసీపై చర్చలో ఎంపి భర్తృహరి మెహతాబ్‌ జోక్యంచేసుకుని ఈ బిల్లులో అద్దెకుగర్భధారణ చేస్తున్న మహిళ ఎలాంటి నగదురూపేణా ప్రతిఫలాన్ని ఆశించకూడదని మాత్రమే నిర్దేశించారని, సరోగసి ద్వారా దంపతులు కృత్రిమ గర్భధార ణకు తిరస్కరించినపక్షంలో ఆ దంపతులు అప్పీలుకు వెళ్లే అవకాశాన్ని స్పష్టంచేయలేదని వివరించారు.

ఎవరైనా సమీపబంధువులు గర్భం దాలి స్తే వచ్చే సమస్యేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా అద్దెమాతృత్వానికి మార్కెట్‌పెరిగిపోతోందని, ఇందుకు సబంధించిన నియమనిబందనలు లేకపోవడమే ఇందుకుకారణమని మెహతాబ్‌ పేర్కొన్నారు. స్వలింగసంపర్కులు, వితంతువులు, ఏకాకిగా ఉన్న వ్యక్తు లు, సహజీవనం చేస్తున్నవారికి సరోగసీలో పొందుపరిచినప్రత్యేక అంశా లు స్పష్టంచేయలేదని కోరారు. అద్దెమాతృత్వాన్ని దేశంలో ఇక నిర్దిష్టమైన విధానంలో మాత్రమే కొనసాగించాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, మహిళ లను ఈ రూపేణా దోపిడీచేయడాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మరింతగా అమాయక మహిళలను మోసం చేస్తున్నారని ప్రభుత్వం ఈ బిల్లునుప్రవేశపెట్టింది. అయితే సరోగసి కాకుండా పుట్టిన పిల్లలపట్ల ప్రభుత్వం వారిపరిరక్షణకు కట్టుబడి ఉందని వెల్లడించింది. ఈ బిల్లుప్రకారం చూస్తే కేవలం చట్టపరంగా వివాహం చేసుకున్న దంపతులకు మాత్రమే సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనేందుకు అవకాశం ఉంది.

కేవలం వైద్యఖర్చులుమినహా మరే ఇతర రూపేణా కృత్రిమ గర్భధారణ దాల్చే తల్లికి ఎలాంటి చెల్లింపులు ఉండకూడదని బిల్లునిర్దేశిస్తోంది. కేంద్ర రాష్ట్రాలస్థాయిలో సరోగసీ రెగ్యులేషన్‌బోర్డులను ఏర్పాటుచేసి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. మరోసభ్యుడు కాకోలి గోష్‌ మాట్లాడుతూ కృత్రిమ గర్భధారణను నిషేధించిన పక్షంలో ఇద్దరు పురుష భాగస్వాములు పిల్లల్ని కనేందుకు ఉన్న ఏకైకమార్గాన్ని నిషేధిస్తున్నారని ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. గుజరాత్‌లో అనేకమంది మహిళలు ఈపద్దతిలో మోసాలకు గురయ్యారని అన్నారు. వృత్తిరీత్యా వైద్య నిపుణులు అయిన కాకోలిగోష్‌ ఇన్‌విట్రోఫెర్టిలైజేషన్‌ విధానాన్ని మొత్తం వివరించారు.

ఈబిల్లును అండం ఫలదీకరణకు ఎన్నిరోజులయినా వైద్య నిపుణుల సూచనమేరకు జరిగేవిధంగా సవరించాలని సూచించారు. ఈబిల్లులో అండాన్ని 56రోజులపాటు సంరక్షించాలని సూచించారని, ఈ బిల్లుపై బహిరంగచర్చ జరగాల్సిందేనని సూచించారు. ఈబిల్లును పున రుత్పత్తి సహాయక సాంకేతిక పరిజ్ఞాన బిల్లుతోపాటే అమలుకు తీసుకు రావాలని అన్నారు. అవివాహిత జంటలు, ఏకాకి తల్లితండ్రులు, సహ జీవనంచేసేవారు, స్వలింగసంపర్కులు ఎక్కువగా ఈ సరోగసీ విధానాన్ని అవలంభిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధానంలో ప్రైవేటు క్లిని క్కులు, ఆసుపత్రులు గుత్తాధిపత్యంతో ఉన్నాయని వాణిజ్యవిధానాలను అరికట్టడం మంచిదేనని అయితే కొన్ని సవరణలు అనివార్యమని అన్నారు.

కొందరు సెలబ్రిటీలు, చలనచిత్ర నటీమణులు సైతం ఈఫ్యా షన్‌ సరోగసీని అవలంభిస్తున్నారని అన్నారు. అన్నిపార్టీలు సరోగసి వాణిజ్యవిధానాలనుఅరికట్టాలనికోరడం సంతోషకరమని కేంద్ర మంత్రి నడ్డాపేర్కొన్నారు

. ఇక జీరోఅవర్‌లో ఆర్ధికశాఖ సహాయమంత్రి పోన్‌రాధా కృష్ణన్‌ మాట్లాడుతూ శబరిమలలో యాత్రీకులు పోలీసు ఆంక్షలకు బలైపోతున్నారని వెల్లడించారు. పోలీసులు యాత్రీకులకోసం ప్రైవేటు వాహనాలను అనుమతించపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు.

రాజ్యసభలోసైతం ఇదేతరహా నిరసనలు తలెత్తడంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను వాయిదావేసారు. ఈనెల 24,26 తేదీల్లో కూడా రాజ్యసభ సమావేశాలు ఉండవని ప్రకటించారు.

క్రైస్తవుల పండుగ క్రిస్మస్‌ సందర్భంగా పార్లమెంటు సమావేశాలు ఆరోజుల్లో జరగవు. ఇక రాజ్యసభలో ఛైర్మన్‌ మాట్లాడుతూ మొత్తం 93 మంద ఇసభ్యులు రూ.38 కోట్లరూపాయలు కేరళ వరద సహాయ నిధికి అందచేసారని, 60 మందిసభ్యులు వారి నెలజీతాన్ని అందించారని అన్నారు. నిరసనలు అదేరీతిలోకొనసాగడంతో సభను గురువారానికి వాయిదావేసారు