సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ డేట్ & వేదిక వివరాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మే 12 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి పెట్టారు.

రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై ఒక్కసారిగా అంచనాలు పెంచేయగా..ఇక ఇప్పుడు అసలు సిసలైన ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 07 న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో వేడుకను జరపబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ మేరకు సర్కారు వారి పాట సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ సినిమాకు సంగీతం ఎస్ ఎస్ థమన్. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.