దుమ్ములేపుతున్న మా .. మా ..మహేశా సాంగ్ ప్రోమో

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉంది. ఇప్పటికే పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ , స్టిల్స్ రిలీజ్ చేసిన మేకర్స్..చిత్రంలోని మా .. మా ..మహేశా అనే మాస్ సాంగ్ ప్రోమో ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ లో మహేష్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టాడు.

ఇక ఈరోజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ వేడుకను జరపబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం ఎస్ ఎస్ థమన్. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

https://youtube.com/watch?v=-o0r_MljIXg