`స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్

Sarileru Neekevvaru pre release function

శ్రీనువైట్ల మాట్లాడుతూ – “అనిల్‌గారు, దిల్‌రాజుగారు క‌లిసి చేసిన ఈ సినిమాకు మెగాస్టార్‌, సూప‌ర్‌స్టార్ క‌ల‌వ‌డం అనేది చాలా పెద్ద విష‌యం. ఈ క‌ల‌యిక‌ను నిజం చేసినందుకు చిరంజీవిగారికి థ్యాంక్స్‌. మ‌హేశ్‌గారితో నేను రెండు సినిమాలు చేశాను. ఆయ‌నంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే అనిల్ రావిపూడి నా రూమ్మేట్‌. త‌న‌తో అలా ప‌రిచ‌యం ఉంది. అలాగే నేను డైరెక్ట‌ర్ కాక‌ముందు, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాక‌ముందు నుండి ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంది. నాకు ఇష్టమైన అంద‌రూ క‌లిసి చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. లాస్ట్ డికేడ్ మ‌హేశ్‌కి దూకుడుతో శుభారంభం వ‌చ్చింది. ఈ డికేడ్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రుతో శుభారంభం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ మాట్లాడుతూ – “గొప్ప కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాలో మేం కూడా భాగం కావ‌డం చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్‌లో చిత్రీక‌రించిన స‌న్నివేశాల్లో మ‌హేశ్‌గారిని కాస్త క‌ష్ట‌పెట్టాం. కొత్త యాక్ష‌న్స్‌ను మీరు చూడ‌బోతున్నారు. మ‌హేశ్‌గారికి స‌రిపోయే టైటిల్ ఇది. ఆయ‌న సినిమా వంద‌శాతం కాదు.. వెయ్యి శాతం ప్రేమిస్తారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి యాక్ట‌ర్ అని చెప్పాలి. నటీన‌టులను ఆడిస్తూ పాడిస్తూ త‌న‌కేం కావాలో దాన్ని చ‌క్క‌గా తీసుకుంటారు అనిల్ రావిపూడి. లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతిగారిని చూస్తుంటే ఎన‌ర్జీ చూస్తున్న‌ట్లు అనిపించింది“ అన్నారు.

త‌మ‌న్నా మాట్లాడుతూ – “చిరంజీవిగారికి థ్యాంక్స్‌. మ‌హేశ్ సినిమాలో సాంగ్ చేయ‌డం హ్యాపీ. అలాగే నేను క‌లిసిన మంచి వ్య‌క్తుల్లో డైరెక్ట‌ర్ అనిల్‌గారు ఒక‌రు. నాకు మంచి ఫ్రెండ్. ర‌ష్మిక మైండ్ బ్లాక్ సాంగ్‌లో మైండ్ బ్లాక్ రేంజ్‌లో చేసింది. సినిమాను అంద‌రూ క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దిల్‌రాజుగారు, దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు స‌హా మంచి టీమ్ క‌లిసి చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది“ అన్నారు.
`స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్

కొర‌టాల శివ మాట్లాడుతూ – “మెగాస్టార్‌గారిని ఇక్క‌డ చూడ‌టం ఆనందంగా ఉంది. స‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్ పెట్టిన‌ప్పుడు యాప్ట్ టైటిల్ పెట్టార‌ని హ్యాపీగా అనిపించింది. అలాగే ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను అనిల్ రావిపూడి అర్థం చేసుకున్నంత‌గా ఎవ‌రూ అర్థం చేసుకోరు. త‌న సినిమాలో ఫుల్ మీల్స్ ఉంటుంది. మీరు ఎంట‌ర్‌టైన్ చేసే స్టైల్‌కి ఓ సూప‌ర్‌స్టార్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతుంది. ఈవాళే ఆయ‌న తండ్రి కూడా అయ్యాడు. త‌న‌కు ఈ ఇయ‌ర్ ఓ బ్యాంగ్‌లా స్టార్ట్ అవుతుంది. నేను విజ‌య‌శాంతిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెను స్క్రీన్‌పై చూడ‌టానికి చాలా ఆస‌క్తిగా ఉంది. దేవిశ్రీ నిజంగానే రాక్‌స్టార్‌. ఎంటైర్ యూనిట్‌కు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నాను“ అన్నారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ – “నాకు సినిమా అంటే పిచ్చి పుట్ట‌డానికి కార‌ణం మీరే. దాని వ‌ల్లే ఇక్క‌డ వ‌రకు రాగ‌లిగాను. ఆయ‌నతో పాటు మ‌హేశ్‌గారు, విజ‌య‌శాంతిగారుముందు ఇలా నిల‌బ‌డి మాట్లాడ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను. చిరంజీవి, విజ‌య‌శాంతిగారు క‌లిసి చేసిన సినిమాలు గురించి చాలానే చెప్పుకుంటూ పోవ‌చ్చు. అనిల్‌కి కంగ్రాట్స్‌. ర‌ష్మిక‌కు అభినంన‌లు. దేవిశ్రీ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. మీ కెరీర్‌లో మ‌హ‌ర్షి బిగ్గెస్ట్ హిట్‌. జ‌న‌వ‌రి 11న అది మారాల‌ని నేను కోరుకుంటున్నాను. స‌రిలేరు నీకెవ్వ‌రు మీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని బావిస్తున్నాను. ఈ సినిమా కోసం అనిల్‌, మ‌హేష్‌గారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. జ‌న‌వ‌రి 11న పండ‌గ సినిమా. ఈ సంక్రాంతి మూడు రోజుల ముందుగానే రాబోతుంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది వెరీ బెస్ట్‌“ అన్నారు.

ర‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ – “చిరంజీవిగారు నా ఛ‌లో, గీత గోవిందం సినిమా ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా వ‌చ్చారు. ఆయ‌న ల‌క్కీ ఛార్మ్‌గా భావిస్తున్నాను. అనిల్ రావిపూడికి కంగ్రాట్స్‌.. త‌న ఈ సినిమాతో హిస్ట‌రీ క్రియేట్ చేయ‌బోతున్నారు. ఇందులో న‌న్ను భాగం చేసినందుకు అనిల్‌కి థ్యాంక్స్‌. దేవిశ్రీ నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని హీ ఈజ్ సో క్యూట్‌.. మైండ్ బ్లాక్ సాంగ్స్‌తో నిల‌బెట్టుకున్నాన‌నే అనుకుంటున్నాను. విజ‌య‌శాంతిగారిని తొలిసారి క‌లిసిన‌ప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాను. కానీ ఆమె నాలో చాలా కాన్ఫిడెంట్‌ను నింపింది. నేను ఆయ‌న్ని చాలానే ఇరిటేట్ చేశాను. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు అనిల్ సుంక‌ర‌, దిల్‌రాజుగారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ఆది శేష‌గిరిరావు మాట్లాడుతూ – “నేను తీసిన కొడుకు దిద్దిన కాపురం సినిమాతోనే మ‌హేశ్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. పెద్ద న‌టుల మ‌ధ్య 14 వ‌య‌సున్న లిటిల్ స్టార్ .. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ అయ్యాడు. అనిల్ సుంక‌ర‌గారు, డైరెక్ట‌ర్ అనిల్ గారు సినిమా మొద‌లు పెట్ట‌కుండానే మేం సంక్రాంతికి సినిమా ఇస్తున్నాం అని చెప్పిన రోజున ఇద్ద‌రూ ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమా చేస్తే విజ‌య‌వాడ‌లో ఘ‌న స‌న్మానం చేస్తాన‌ని మాట ఇచ్చాను. ఇలాంటి డిసిప్లెయిన్ ఉంటే ఇండ‌స్ట్రీ బావుంటుంది. అందుకు హీరోల స‌హకారం కూడా అవ‌స‌ర‌మే. ఇంత పెద్ద సినిమాను ఆరు నెల‌ల్లో పూర్తి చేసినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దేవిశ్రీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సినిమా చూడ‌బోతున్నామ‌నే ఫీలింగ్ క‌లిగింది. విజ‌య‌శాంతిగారు, ర‌ష్మిక స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు“ అన్నారు.
`స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ట్రైల‌ర్ ఎంత ర‌చ్చ ర‌చ్చ‌గా ఉందో.. సినిమా కూడా అంతే ర‌చ్చ ర‌చ్చ‌గా ఉంటుంది. తెలుగు ఇండ‌స్ట్రీకి అంద‌రివాడైన చిరంజీవిగారు ఈ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథిగా రావ‌డం హ్యాపీగా ఉంది. నేను మ‌హేశ్‌గారితో సీత‌మ్మ వాకిట్లో సిరిమెల్లెచెట్టు, మ‌హ‌ర్షి త‌ర్వాత చేసిన హ్యాట్రిక్ చిత్ర‌మిది. అనిల్ రావిపూడి ప‌టాస్ త‌ర్వాత చేసిన నాలుగు సినిమాలు మాతోనే చేయ‌డం మా లక్కీ. ఈ స‌క్సెస్‌ను ఇలాగే కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. దేవిశ్రీతో మా బ్యాన‌ర్‌లో చేసిన 12వ సినిమా.. 4 హ్యాట్రిక్ ఇది. ఇంత మంది కాంబినేష‌న్‌లో అనిల్‌గారితో క‌లిసి సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. నేను చాలా ల‌క్కీగా ఉంది. విజ‌య‌శాంతిగారి రీ ఎంట్రీ మా సినిమాతో రావ‌డం ఆనందంగా ఉంది. ర‌ష్మిక స‌క్సెస్ ట్రాక్‌లో వెళుతుంది. అనిల్ సుంక‌ర‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ – “మౌనంగా ఎద‌గ‌మ‌ని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒద‌గ‌మ‌ని అర్థ‌మందులో ఉంది.. ఈ గేయానికి నిలువెత్తు రూపం చిరంజీవిగారు. డీసెన్స్‌, డిగ్నిటీ, డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ మిమ్మ‌ల్ని చూసి మేం నేర్చుకోవాలి. ఆయ‌న మా వేడుక‌కి రావ‌డం మాకు గ‌ర్వ‌కార‌ణం. మే 31 సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారి పుట్టిన‌రోజున ఆయ‌న పుట్టిన‌రోజుకి ప్రారంభ‌మైన ఈ చిత్రం ఇలా విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. జ‌న‌వరి 11న రిలీజ్ చేయాల‌ని అప్పుడే అనుకున్నాం. అద్భుతం జ‌రిగేట‌ప్పుడు ఎవ‌రికీ తెలియ‌దు. జ‌రిగిన త‌ర్వాత అంద‌రికీ గుర్తుండిపోతుంద‌ని కృష్ణ‌గారు చెబుతుండేవారు. ఈ జ‌న‌వ‌రి 11న అద్భుతం జ‌రుగుతుంది. ఈ సినిమా ఫ్యాన్స్‌, ఫ్యామిలీ స‌హా అంద‌రిదీ. మ‌హేశ్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాల‌నుకుంటున్నారో అలాగే చూపిస్తాన‌ని ఆరోజున అనిల్ రావిపూడిగారు ప్రామిస్ చేశారు. అంత‌కంటే ఎక్కువ చూపించారు. ఈ సినిమాతో ఆయ‌న నెక్ట్స్ లీగ్ డైరెక్ట‌ర్ అవుతారు. నేష‌న‌ల్ అవార్డు విజ‌య‌శాంతిగారికి ఎందుకు వ‌చ్చిందా? అని ఈ సినిమా చూసిన త‌ర్వాత మ‌రోసారి అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఆమె పెర్ఫామెన్స్ మైండ్‌బ్లోయింగ్‌. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, ర‌ష్మిక అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు దిల్‌రాజుగారు స‌మ‌ర్ప‌కుడిగా చేశారు. మా క‌ష్టాన్ని మేం ఆయ‌న‌కు స‌మ‌ర్పిస్తే.. ఆయ‌న చిరున‌వ్వుతో తీర్చేశారు. ఆయ‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్‌. నా లైఫ్‌లో మెముర‌బుల్ జ‌ర్నీ మై హీరో మ‌హేశ్‌గారితో..ఆయ‌న‌తో మ‌రోసారి జ‌ర్నీ చేసినందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న డేడికేష‌న్ అద్భుతం ప్ర‌తి షాట్‌ను ఓ సినిమాలా చూస్తారు. ఈ సినిమాతో ఆయ‌న మీదున్న రెస్పెక్ట్ ప‌దింత‌లు పెరుగుతుంది. సినిమా ప్రారంభం రోజున ఫ్యాన్స్ మేం కాల‌ర్ ఎత్తుకుని తిరిగేలా సినిమా ఉండాల‌ని అన్నారు. మేం చెబుతున్న‌దొక‌టే.. ఈసినిమా తెలుగువాళ్లు త‌లెత్తుకుని తిరిగేలా ఉంటుంది. మ‌హేశ్‌గారికి, అనిల్ రావిపూడికి, ఇక్క‌డ‌కు ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మెగాస్టార్‌కి థ్యాంక్స్‌“ అన్నారు

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “పొద్దునే కొడుకు ప‌ట్టాడు. సాయంత్రం స‌రిలేరు సినిమా ఫంక్ష‌న్ ఇలాంటి ఫీలింగ్ నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌. మెగాస్టార్ చిరంజీవిగారు, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌గారు, విశ్వ‌న‌ట‌భార‌తి, మా రాములమ్మ విజ‌య‌శాంతి.. ముగ్గురినీ చూస్తుంటే ఆకాశంలోని స్టార్స్ అన్నీ నేల‌మీదుకు వ‌చ్చిన‌ట్లు అనిపిస్తున్నాయి. నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజుది. ప్ర‌తి మ‌నిషిలో క‌ళ పుట్ట‌డానికి ఓ క‌ళ ఉంటుంది. అలాంటి క‌ళ పుట్ట‌డానికి చిరంజీవిగారే కార‌ణం. నాలో పుట్టిన మొద‌టి క‌ళ డాన్స్‌. చిన్న‌ప్పుడు అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ పాట‌కు డాన్స్ చేస్తే జామెంట్రీ బాక్స్ ఇచ్చారు. ల‌వ్‌మీ మై హీరో పాట‌కు డాన్స్ చేస్తే స‌బ్బు పెట్టే ఇచ్చారు. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న ఈ సినిమాకు సంక్రాంతి ముగ్గులా అందం తెచ్చిన న‌టి విజ‌య‌శాంతిగారు. ఈ సినిమాలో పాత్ర‌ను ఆమె ఒప్పుకుని న‌టించినందుకు ఆమెకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. ఆమెను త‌ప్ప ఈ పాత్ర‌కు మరొక‌రిని ఊహించుకోలేక‌పోయాను. ఆమె గొప్ప న‌ట‌న‌ను చూపించారు. ప‌వ‌ర్ ఆఫ్ ఉమెన్‌ను ఈసినిమాలో ఆమె త‌న న‌ట‌న‌తో చూపించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, ప్ర‌కాశ్‌రాజ్‌గారు, ర‌ష్మిక‌, సంగీత‌గారు, రావు ర‌మేష్‌గారు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. నాతో పాటు ప‌నిచేసిన మా టెక్నీషియ‌న్స్‌కి థ్యాంక్స్‌. ర‌త్న‌వేలుగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. డిసెంబ‌ర్ అంతా దేవిశ్రీగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ ఇర‌గొట్టేశారు. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు కూడా ఉంటారు. ఆయ‌నెలా ఉంటార‌నేది సినిమాలో చూడాల్సిందే. ప్ర‌కాశ్‌గారు అద్భుత‌మైన ఆర్ట్ వ‌ర్క్ ఇచ్చారు. నా హోం బ్యాన‌ర్‌లో నేను చేసిన ఐదో సినిమా ఇది. అనీల్ సుంక‌ర‌గారితో తొలిసారి ప‌నిచేశాను. అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చారు. ఎఫ్ 2 షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌హేశ్‌గారికి ఈ క‌థ చెప్పాను. క‌థ విని.. సినిమా చేస్తున్నామ‌ని చెప్పిన క్ష‌ణాలు.. ఫిబ్ర‌వ‌రిలో పిలిచి సినిమా క‌థ చేయ‌మ‌ని చెప్పిన క్ష‌ణాలు. జూలై నుండి ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఆయ‌న‌తో చేసిన ప్ర‌తి క్షణం నా జీవితంలో నేను గుర్తు పెట్టుకునే ఉంటాను. నాకు పెద్ద అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న నాకు ఏమిచ్చారు అనేదానికి రేపు జ‌న‌వ‌రి 11న మంచి హిట్ ఇచ్చి తిరిగి ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. సినిమా బాగా వ‌చ్చింది. జ‌న‌వ‌రి 11న బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోతుంది“ అన్నారు.

న‌ట విశ్వ భార‌తి విజ‌య‌శాంతి మాట్లాడుతూ – “మెగాస్టార్ చిరంజీవిగారికి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌గారికి, మా తోటి న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కి, మా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిగారికి, నిర్మాత‌లు అనీల్ సుంక‌ర‌గారికి, దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. 1979 నుండి 2020 వ‌ర‌కు నాది లాంగ్ జ‌ర్నీ. మీ అంద‌రితో క‌లిసి న‌డిచాను. న‌న్ను ఆ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు. మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. యాక్ష‌న్ మూవీస్‌, కామెడీ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేశాను.. మెగాస్టార్ చిరంజీవిగారితో క‌లిసి ప‌లు సినిమాలు చేశాను. అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న మ‌హిళ‌లంద‌రికీ నేనున్నాను మీకోసం ధైర్యంగా అడుగు ముందుకేయండి అని నా సినిమాలు చాలా సంద‌ర్భాల్లో చెప్పాయి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురుచూడ‌కండి.. రేప‌టి జీవితం మీదే.. మ‌హిళాశ‌క్తులు మీరే. 1988లో లిటిల్ స్టార్ మ‌హేశ్‌తో కృష్ణ‌గారి డైరెక్ష‌న్‌లో నేను న‌టించాను. నేను మ‌ళ్లీ మ‌హేశ్‌బాబుతో ప‌నిచేస్తాన‌ని అనుకోలేదు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి న‌న్ను ప‌రిచ‌యం చేసింది హీరో కృష్ణ‌గారు. నా మొద‌టి హీరో ఆయ‌నే. విజ‌య నిర్మల‌గారిని కూడా ఈరోజు మ‌ర‌చిపోలేను. కృష్ణగారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. మ‌ళ్లీ రీ ఎంట్రీ మ‌హేశ్‌గారితో కావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా ఉంది. మహేశ్ అబ్బాయి గౌత‌మ్‌తో కూడా యాక్ట్ చేయ‌డానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మ‌హేశ్ బంగారం. డౌన్ టు ఎర్త్‌. ఒక‌మాట‌లో చెప్పాలంటే.. బంగారం. సూప‌ర్‌స్టార్ అనే ప‌దానికి అర్థం మ‌హేశ్‌బాబుగారు. అంచెలంచెలుగా ఎద‌గ‌డం, ఒద‌గ‌డం, నేర్చుకోవ‌డం, మీ అభిమానాన్ని సంపాదించ‌డం చూస్తుంటే.. మ‌హేశ్‌ని మించిన‌వారు లేరు. కొత్తద‌నం కావాల‌ని ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూ వ‌చ్చారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా కొత్త‌గా ఉంటుంది. ఆయ‌నేనా న‌టించింది అని నాకు డౌట్ వ‌స్తుంది. కామెడీ అద్భుతంగా చేశాడు. ఇక డాన్స్ అయితే రెచ్చిపోయాడ‌నే చెప్పాలి. మా కాంబినేష‌న్లో సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. 13 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ మ‌హేశ్‌తో ఇవ్వ‌డం ఆనందంగా ఉంది. సినిమాల్లోనే కాదు.. నిజంగా కూడా ఆయ‌న సూప‌ర్‌స్టార్‌. వెయ్యి మంది ఆడ‌పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేశారంటే.. మామూలు విష‌యం కాదు.. గ్రేట్ అనే చెప్పాలి. ఆయ‌న‌, ఆయ‌న భార్యా పిల్ల‌లు వందేళ్లు బావుండాల‌ని దీవిస్తున్నాను. డైరెక్ట‌ర్ అనిల్ కామెడీ సినిమాల‌తో అద్భుతంగా చూపించారు. ర‌ష్మిక చ‌క్క‌గా న‌టించింది. కొత్త ట్రెండ్ తీసుకొస్తుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ పాత్ర‌కు నేను న్యాయం చేస్తాన‌నే గ‌ట్టి న‌మ్మి నాతో ఈ పాత్ర‌ను చేయించారు. నా శాయ‌శ‌క్తులా నా పాత్ర‌కు న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. ర‌త్న‌వేలుగారు అద్భుతంగా మ‌మ్మ‌ల్ని చూపించారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అంద‌రూ అద్భుతంగా చేశారు. జ‌న‌వ‌రి 11న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. బోర్డ‌ర్‌లో మ‌న కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఈ సినిమాను అంకిత‌మిస్తున్నాం“ అన్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మాట్లాడుతూ – “ఈరోజు నిజంగానే అద్భుత‌మైన రోజు. మా డైరెక్ట‌ర్ అనిల్‌కి కొడుకు పుట్టాడు. అలాగే మా నిర్మాత దిల్‌రాజుగారు మ‌రోసారి తాత‌గారయ్యారు. ఆయ‌నింటికి ఓ ఆడ‌పిల్ల వ‌చ్చింది. ఇన్ని మంచి విష‌యాలు ఒకేరోజు జ‌రిగింది. అన్నింటికీ మంచి మేం పిల‌వ‌గానే మెగాస్టార్ చిరంజీవిగారు ఈ వేడుక‌కి రావ‌డం గొప్ప విష‌యం. మా టీం ఈ విష‌యాన్ని ఎప్ప‌టీకి మ‌ర‌చిపోదు. ఒక్క‌డు సినిమా చూసి ఆయ‌న చెప్పిన మాట‌లు నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చాయి. అలాగే అర్జున్ స‌మ‌యంలో మా సెట్‌కు వ‌చ్చి నీలాంటి వాళ్లు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం.. ఇండ‌స్ట్రీ ముందుకు తీసుకెళ్లాల‌ని చెప్పిన మాట‌లు. ఇంకా నాకు గుర్తే. పోకిరి స‌మ‌యంలోనూ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్లి క‌లిశాను. సినిమా గురించి, నా పెర్ఫామెన్స్ గురించి రెండుగంట‌ల పాటు మాట్లాడారు. ఆ మాట‌ల‌ను నేనింకా మ‌ర‌చిపోలేదు. ఆయ‌న ఎప్పుడు నాకు ఇన్‌స్పిరేష‌నే. భ‌ర‌త్ అనే నేను , మ‌హ‌ర్షి సినిమాలు రిలీజ్ అయిన త‌ర్వాత ఫ‌స్ట్ పోన్ కాల్ ఆయ‌న ద‌గ్గ‌ర నుండే నాకు వస్తుంది. జ‌న‌వ‌రి 11న కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుండి తొలి ఫోన్ రావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌య‌శాంతిగారితో కొడుకు దిద్దిన కాపురం త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ప‌నిచేశాను. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే డేడికేష‌న్‌తో ఉన్నారు. ఆమెకు మేం అవ‌కాశం ఇచ్చార‌ని ఆమె చెప్పారు కానీ.. నిజానికి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుని ఆమె మాకు అవ‌కాశం ఇచ్చారు. స్క్రిప్ట్ విన్న త‌ర్వాత విజ‌య‌శాంతిగారు ఒప్పుకుంటారో లేదో అన్నాను. కానీ త‌ను ఆమెను ఒప్పించాడు. భార‌తి క్యారెక్ట‌ర్‌ను ఆమె త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేరు. ఆమెకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. డైరెక్ట‌ర్ అనిల్ గురించి చెప్పాలంటే.. నేను చాలా మందితో ప‌నిచేశాను కానీ, ఓ డైరెక్ట‌ర్‌లో అంత పాజిటివ్ ఎన‌ర్జీని నేనెప్పుడూ చూడ‌లేదు. నేను ప్ర‌తిరోజు ఎంజాయ్ చేస్తూ చేశాను. జూలై 4న సినిమాను స్టార్ట్ చేస్తే డిసెంబ‌ర్ 18న షూటింగ్ అయిపోయింది. నేనెప్పుడూ అంత ఫాస్ట్‌గా సినిమా చేయ‌లేదు. దానికి కార‌ణం అనిలే. ప్ర‌తిరోజూ ఓ ఎన‌ర్జితో ప‌నిచేశాం. ఇన్‌టెన్స్ సీన్స్‌ను కూడా హాయిగా చేశాం. రేపు అది సినిమాలో క‌న‌ప‌డుతుంది. నేను మాస్ సినిమా చేసి చాలారోజులైంద‌ని ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎప్పుడైనా క‌థ న‌చ్చితేనే చేస్తాను. అనిల్ రావిపూడి క‌థ న‌చ్చింది. చేశాను. జ‌న‌వ‌రి 11 కోసం వేచి చూశాను. ర‌త్న‌వేలుగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ యోగుల్లా ఉంటారు. ఈ సినిమాలో వారి యాక్ష‌న్స్ బెస్ట్‌. శేఖ‌ర్ మాస్ట‌ర్ బాగా చేశాడు. త‌మ‌న్నాకి థ్యాంక్స్‌. ర‌ష్మిక చాలా స్వీట్‌. జ‌న‌వ‌రి 11న మీకొక కానుక ఇవ్వ‌బోతున్నాం. అది డైరెక్ట‌ర్ అనిల్ వ‌ల్లే సాధ్య‌మైంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను“ అన్నారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/