టెస్ట్ క్రికెట్ కి సర్ఫరాజ్ పనికిరాడు

టెస్ట్ క్రికెట్ కి సర్ఫరాజ్ పనికిరాడని మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది, జహీర్ అబ్బాస్ అన్నారు

2017 లో మిస్బా-ఉల్-హక్ రిటైర్ అయిన తరువాత నుంచి సర్ఫరాజ్ పాకిస్తాన్ జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్లో పాకిస్తాన్ జట్టు ఏడవ స్థానానికి దిగజారడం కానీ ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో తమ జట్టు కనీసం సెమీస్ కూడా చేరలేని కారణంగా సర్ఫరాజ్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నారు. పరిమిత ఓవర్ల వన్డే టి20లకు విజయవంతమైన కెప్టెన్ అయినా టెస్ట్ క్రికెట్ఫార్మేట్ కి సర్ఫరాజ్ పనికిరాడని మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నారు. మూడు క్రికెట్ ఫార్మాట్లకు  కెప్టెన్సీ నిర్వహించడం పెను భారమే అని టెస్ట్ మ్యాచ్లకు సారథ్యం వహించి నెగ్గుకు రావడం అంత తేలిక కాదని మరో దిగ్గజ ఆటగాడు అయినా జహీర్ అబ్బాస్ అన్నారు.

ఇది ఇలా ఉండగా సొంతగడ్డపై ఈ 27 నుంచి శ్రీలంకతో ఆడబోయే 3వన్డేలు 3టి20లకు టీం సన్నద్ధమవుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చెయండి https://www.vaartha.com/news/sports/