చీరకు మ్యాచింగ్‌ మాస్క్‌

న్యూట్రెండ్‌-లేడీస్ స్పెషల్

Saree matching mask
Saree matching mask

చీరకు మ్యాచింగ్‌ మాస్క్‌ ఉందా అంటూ మహిళలు బట్టల దుకాణంలో అడుగుతున్న కార్టూను ఆ మధ్య నవ్వు తెప్పించినా ఇప్పుడు అలాంటి మాస్కులు వచ్చేస్తున్నాయి. అలాగని చీరరంగులో సాదాసీదాగా ఉంటాయనుకుంటే పొరబాటు.

ఇవి వేడుకల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన మాస్కులు.

ఇప్పట్లో పెళ్లిళ్లూ, పెద్దపెద్ద ఫంక్ష్లన్లు లేకపోయినా కుటుంబంలో జరిగే చిన్న వేడుకకు , లేదా కాస్త ఆడంబరంగా ఉండే గాగ్రానో వేసుకున్నప్పుడు ఆ డిజైనులోనే మ్యాచ్‌ అయ్యే మాస్కులివి.

అంటే చీర రంగుతోపాటూ దానిపైన ఎలాంటి డిజైను ఉంటుందో అదేవిధంగా కుందన్లూ, చమ్కీలూ, టాజిల్స్‌, ఎంబ్రాయిడరీ ఇలా అన్నిరకాల వర్క్‌లూ వాటిపైన చేస్తున్నారిప్పుడు. బాగున్నాయి కదా.

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/