పుష్ప ఫై శరత్ కుమార్ ప్రశంసలు

సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ ‘పుష్ప : ది రైజ్’ ‘ చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో బన్నీ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ పుష్ప రాజ్ కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చూసి చాలామంది సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేయగా..తాజాగా తమిళ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ ప్రశంసలు కురిపించారు.

శరత్ కుమార్ ట్విట్టర్ లో.. పుష్ప సినిమా ను ఈ రోజు చూశాను. అల్లు అర్జున్ నటన చాలా ఎనర్జిటిక్ గా బాగుంది. అల్లు అర్జున్ కు.. దర్శకుడు సుకుమార్ కు ..మైత్రి మూవీ మేకర్స్ కు మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశాడు. శరత్ కుమార్ ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందించాడు. థ్యాంక్యూ వెరీ మచ్ శరత్ గారు. మీకు నా నటన నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమకు కృతజ్ఞతలు అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు. శరత్ కుమార్ మాత్రమే కాకుండా ప్రతి రోజు ఎవరో ఒకరు స్టార్ లేదా ప్రముఖులు ట్వీట్ చేయడం వారికి బన్నీ మురిసి పోతూ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. గతంలో శరత్ కుమార్ – అల్లు అర్జున్ కలయికలో బన్నీ సినిమా చేసారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ తండ్రిగా శరత్ కుమార్ నటించాడు.