ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కుమార్తె ఉపాధ్యక్షురాలిగా ప్ర‌మాణం

దావో: పిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో డుటెర్టి కుమార్తె సారా డుటెర్టి ఆ దేశ ఉపాధ్య‌క్షురాలిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దావో న‌గ‌రంలో జ‌రిగిన వేడుకలో అధ్య‌క్షుడు డుటెర్టితో పాటు త‌ల్లి కూడా హాజ‌ర‌య్యారు. సారా డుటెర్టి వ‌య‌సు 44 ఏళ్లు. ద‌శాబ్ధం నుంచి దావో న‌గ‌రానికి మేయ‌ర్‌గా ఆమె చేస్తున్నారు. అంత‌క‌ముందు ఆ న‌గ‌ర మేయ‌ర్‌గా తండ్రి డుటెర్టి కొన‌సాగారు. ఇటీవ‌ల జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఫెర్డినాండో మార్కోస్ జూనియ‌ర్ గెలిచారు. రోడ్రిగో డుటెర్టి స్థానంలో ఆయ‌న ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రాబోయే రోజుల చాలా స‌వాళ్ల‌తో ఉంటాయ‌ని, అంద‌రం ఏకంగా ఉండాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

కాగా, పిలిప్పీన్స్‌లో అధ్య‌క్ష, ఉపాధ్య‌క్ష ప‌ద‌వుల‌కు వేర్వేరుగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి. 2016లో దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోడ్రిగో డుటెర్టి.. నేరాల్ని అణిచివేసేందుకు క‌ఠోరంగా ప్ర‌య‌త్నించాడు. డ్ర‌గ్స్ నిర్మూల‌న కోసం పోలీసులు ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చారు. దీంతో వేల మందిని అక్ర‌మంగా చంపేసిన‌ట్లు డుటెర్టిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌డిచిన అయిదేళ్ల‌లో జ‌రిగిన వేల మంది కాల్చివేత ఘ‌ట‌న‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టు కూడా కోరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/