తెలంగాణలో కుదించిన సంక్రాంతి సెలవులు!

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సెలవులు తెలంగాణలోని పాఠశాలల్లో ఒక రోజు తగ్గాయి. నిజానికి ఈ సెలవులు జనవరి 11నుంచి 16 వరకు ఉండాల్సింది. అయితే 11న రెండో శనివారం కావడంతో ఆ ఒక్క రోజును మార్చి 12వ తేదీ ఆదివారం నుంచి సెలవులను ప్రకటించారు. గత సంవత్సరం జరిగిన ఆర్టీసి సమ్మె నేపథ్యంలో దసరా సెలవులను ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలవులను భర్తీ చేసేందుకుగాను ఏప్రిల్‌ వరకు ప్రతి నెలా రెండో శనివారాన్ని పనిదినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇక నేపథ్యంలో 11 రెండో శనివారం ఉన్న కారణంగా సంక్రాంతి సెలవులు 12వ తేదీ నుంచి మొదలవుతాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 8, మార్చి 14, ఏప్రిల్‌ 11న కూడా పాఠశాలలు పనిచేస్తాయని అన్నారు. మరోవైపు ఇంటర్‌ కళాశాలలకు ఈనెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/