సంజూకు టీమిండియాకు ఎప్పుడో ఎంపిక కావాల్సింది: గంభీర్‌…

gowtham gabir
gautam gambhir

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు యువ ఆటగాడు సంజూ శాంసన్‌ ఎంపికైనందుకు టీమిండియా మాజీ ఓపెనర్‌, ఎంపి గౌతమ్‌ గంభీర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అతడు జట్టుకు చాలా బాకీ ఉన్నాడని పేర్కొన్నాడు. అతడు టీమిండియాకు ఎప్పుడో ఎంపిక కావాల్సిందని వెల్లడించాడు. బంగ్లాదేశ్‌థో నవంబర్‌ 3 నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు మరో యువ ఆటగాడు శివమ్‌ దూబెకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌కు అభినందనలు. లాఘవమైన చేతులు…చురుకైన పాదాలు…స్థిరమైన బుర్ర. వెళ్లు సంజూ, వెళ్లి నీ అవకాశాన్ని అందిపుచ్చుకో. బాకీ చాలా ఉన్నావ్‌ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. అద్భుత ఆటగాడైన సంజు 19ఏళ్ల వయసులో 2019 జూలైలో భారత్‌ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అద్భుతమైన అతడి కెరీర్‌ ఒడుదొడుకులకు లోనైంది. ఎన్నో కష్టాలు పడ్డాడు. దేశవాళీ, భారత్‌-ఎ తరపున శ్రమించాడు. వైఫల్యాల నుంచి నేర్చుకున్నాడు. ఈ మధ్యే జరిగిన విజ§్‌ు హజారే ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో 212 నాటౌట్‌ పరుగులు చేశాడు. ట్రోపీ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచి బంగ్లా సిరీస్‌కు ఎంపికయ్యాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/