కోహ్లీ, సెహ్వాగ్‌ సరసన చేరిన సంజూ శాంసన్‌…

Sanju Samson
Sanju Samson

హైదరాబాద్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ విరాట్‌ కోమ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌, మురళీ విజ§్‌ు సరసన చేరాడు. ఐపిఎల్‌లో ఒకటి కన్నా ఎక్కువ శతకాలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లలో ఇతడు నాలుగో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన పోరులో శాంసన్‌ వీరబాదుడు తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 55బంతుల్లో 102 పరుగులు చేయడం ద్వారా ఐపిఎల్‌లో రెండో శతకం నమోదు చేశాడు. అంతకుముందు రైజింగ్‌ పూణె సూపర్‌ గెయింట్స్‌పై 2017లో మొదటిసారి శతకం చేశాడు. దీంతో ఐపిఎల్‌లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు సాధించిన భారత ఆటగాళ్లు విరాట్‌కోహ్లీ (4), సెహ్వాగ్‌ (2), మురళీ విజ§్‌ు (2) సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని రమానె, శాంసన్‌ విరుచుకుపడ్డాడు. ఈ్కరమంలో సంజూ శాంసన్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఈమ్యాచ్‌లో హైదరాబాద్‌ను బ్యాట్స్‌మెన్లు వార్నర్‌ (69), బెయిర్‌ స్టో (45) ఆదుకున్నారు. ఆఖర్లో విజ§్‌ు శంకర్‌, యూసుఫ్‌ పఠాన్‌, రషీద్‌ ఖాన్‌ మెరుపులు మెరిపించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని హైదరాబాద్‌ విజయం సాధించింది.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/