యాదాద్రికి బయలుదేరిన బండి సంజయ్

చెప్పినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మి నరసింహ గుడికి బయలుదేరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందనే ఆరోపణలను బిజెపి కొట్టిపారేసింది. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ బండి సంజయ్ ఓ సవాల్ విసిరారు. ఫామ్‌హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తాను యాదాద్రిలో ప్రమాణ స్వీకారం చేస్తానని.. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కూడా రావాలని ఛాలెంజ్ విసిరారు. బండి సంజయ్ విసిరినా సవాల్ ఫై కేసీఆర్ స్పందించనప్పటికీ..బండి సంజయ్ మాత్రం చెప్పినట్లే యాదాద్రి లో ప్రమాణం చేసేందుకు మర్రిగూడ నుండి బయలుదేరారు. అయితే సంజయ్ ని మాత్రం పోలీసులు అడ్డుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటె టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అదుపులోకి తీసుకున్న ముగ్గుర్ని విడుదల చేయాలనీ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను సరూర్ నగర్ లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందుకు తీసుకురాగా..నిందితుల అరెస్ట్ ను ఏసీబీ జడ్జ్ తప్పుపట్టారు. సరైన ఆధారాలు లేవని , ముగ్గురి నిందితులను తక్షణమే విడుదల చేయాలనీ జడ్జ్ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ ల అరెస్ట్ విధానాన్ని ఏసీబీ న్యాయమూర్తి తప్పుపట్టారు. న్యాయమూర్తి తీర్పు తో అంత షాక్లో పడ్డారు.