శానిటైజర్‌ :చేతులకు మాత్రమే వాడాలి

ఆరోగ్యం-జాగ్రత్తలు

Sanitizer- Use only on hands
Sanitizer- Use only on hands

సబ్బుతో చేతులు కడిగితే చేతులపై ఉండే కరోనా వైరస్‌ తొలగిపోతుంది. స్నానం చేసేటప్పుడు అదే సబ్బును ముక్కు, నోటి చుట్టు కూడా రాసుకుంటాం. తర్వాత నీటితో కడిగేసుకుంటాం.

అదేవిధంగా హ్యాండ్‌ శానిటైజర్‌ను ముక్కు, నోటి చుట్టూ రాసుకుంటే మాస్కులు వాడే అవసరం ఉండదు అనుకుంటున్నారు.

కాని అది తప్పు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. శానిటైజర్‌ లేదా క్లోరిన్‌ ద్రవాన్ని ముక్కు, నోటి చుట్టూ రాసుకుంటే ప్రమాదమని చెప్పింది.

హ్యాండ్‌ శానిటైజర్‌, ఆల్కహాల్‌, క్లోరిన్‌ వంటి వాటిని శరీరంపై చల్లుకుంటే అవి శరీరం లోపల ఉన్న వైరస్‌ను చంపలేవని కెమిస్టులు సూచిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/