నాలుగేళ్ల తర్వాత బరిలోకి సానియా

ఢిల్లీ: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత బరిలోకి దిగనుంది. సుధీర్ఘ విరామం తర్వాత ఆమె భారత జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్ధమైంది. చివరగా 2016లో ఫెడ్‌కప్ ఆడిన సానియా 2017 తర్వాత పూర్తిగా ఆటకు దూరంగా ఉండిపోయింది. అయితే గతేడాది బాబుకు జన్మనిచ్చిన సానియా, మళ్లీ ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా వేదికగా ఫెడ్‌కప్ ఆసియా ఓసియాసియా గ్రూప్-1 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ కప్‌లో చైనా, ఇండోనేషియా, కొరియా, ఉజ్బెకిస్థాన్ తో బరిలోకి దిగనున్న భారత్ రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో మిగిలిన ఐదు జట్లతో తలపడనుంది. గత ఆరు నెలలు గా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సానియా మీర్జా, మరి పునరాగమనంలో ఎలా ఆకట్టుకోనుందో వేచి చూడాలి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/