సానియా మీర్జా భావోద్వేగ పోస్టు

Sania Mirza
Sania Mirza

హైదరాబాద్: భారత టెన్నిస్‌ స్టార్‌, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాకు సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానియా పోస్ట్ చేసిన ఆ ఫొటోలో.. ఓ చేతిలో కొడుకు ఇజాన్‌ను, మరో చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని టెన్నిస్‌ కోర్టు నుంచి బయటకు వస్తున్నారు. ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఫొటోనే తాజాగా సానియా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసారు.’ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు’ అనే క్యాప్షన్‌ సానియా మీర్జా రాసుకొచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/