హోబర్ట్‌ ఫైనల్లోకి సానియా మీర్జా

Sania mirza
Sania mirza

హోబర్ట్‌: పునరాగమనంలో ఆడుతోన్న తొలి టోర్నీలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) ద్వయం 76(3), 62తో మారి బౌజ్‌కోవ(చైనీస్ తైపీ)తామరజిడన్‌సెక్(స్లొవెనియా) జోడీని ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఆసాంతం అద్భుత పెర్ఫామెన్స్ కనబర్చిన ఈ ఇండో ఉక్రెయిన్ జోడీ వరుస సెట్‌లలో గెలిచి విజయాన్నందుకుంది. ఇక గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ 62, 46, 104తో కింగ్‌వానియమిక్‌హెల్ క్రిస్టినా (అమెరికా)జోడీపై గెలుపొందింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా సానియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లో నాదియా కిచనోక్‌ (ఉక్రెయిన్‌)తో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోపన్నతో జోడి కట్టనుంది. సానియా రోహన్ బోపన్న జోడీ చివరిసారిగా 2016 ఒలింపిక్స్‌లో ఆడింది. ముందుగా రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి ఆడాలనుకున్నా అతను గాయంతో తప్పుకోవడంతో బోపన్నతో జతకట్టింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/