వచ్చే ఏడాది నుంచి సెకండ్ ఇన్నింగ్స్

తీపి, చేదు జ్ఞాపకాలను చవిచూశా

sania mirza family
sania mirza family

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టాన్ సానియా మీర్జా సెకండ్ ఇన్నింగ్స్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తానని వివరించింది. దీని కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టానని పేర్కొంది. కొడుకు అజాన్, భర్త మాలిక్‌ల బాధ్యత తనపై ఉందని, వారికి ఏలోటు లేకుండా చూస్తూనే కెరీర్‌లో ముందుకు సాగుతానని సానియా తెలిపింది. మాలిక్‌లాంటి భర్త దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఇక, మాతృత్వపు మధురానుభూతి గురించి మాటల్లో వర్ణించలేనని అభిప్రాయపడింది. ఇజాన్ రాకతో తన జీవితమే మారిపోయిందని పేర్కొంది. మరోవైపు రానున్న సీజన్‌లో మెరుగైన ప్రతిభను కనబరచడం లక్షంగా పెట్టుకున్నానని తెలిపింది. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తానని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు సాగిన కెరీర్‌తో పోల్చితే సెకండ్ ఇన్నింగ్స్ చాలా క్లిష్టమని చెప్పింది. ఇందులో రాణించడం అనుకున్నంత తేలిక కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంది. కాగా, టెన్నిస్‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలు తనకు ఉన్నాయని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తానని వివరించింది. భర్త పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అయినా తాను మాత్రం మాతృ దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసింది.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/