సానియా అప్పుడలా..ఇప్పుడిలా

Sania Mirza
Sania Mirza

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పునరాగమనంలో ఆడిన తొలి టోర్నీ హోబర్ట్ ఇంటర్నేషనల్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ విజయానందంతో ఈ సీజన్ తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలోకి దిగిన హైదరాబాద్ స్టార్ అనూహ్యంగా గాయపడి అర్ధాంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ కోసం సానియా తీవ్ర కసరత్తులు చేసింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో అహర్నీషులు కష్టపడింది. ఎంతలా అంటే కేవలం నాలుగు నెలల్లో 26 కిలోల బరువు తగ్గెంత కసరత్తులు చేసింది. ఈ విషయాన్ని సానియానే సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.

’89 కేజీలు – 63 కేజీలు.. మనందరికీ లక్ష్యాలంటాయి. ఇందులో రోజువారీ గోల్స్, లాంగ్‌ టర్మ్ లక్ష్యాలు ఉంటాయి. వాటిలో ప్రతీది సాధించి గర్వపడండి. నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫిట్‌ అవ్వడానికి నాకు ఈ సమయం పట్టింది. పూర్వపు ఫిట్‌నెస్ సాధించడానికి, పునరాగమనంతో అత్యున్నత స్థాయిలో పోటీపడటానికి చాలా సమయం తీసుకున్నట్లు అనిపించింది. మీరు మీ కలలను అనుసరించండి. ఎవరి మాట వినవద్దు. నేను చేశాను.. మీరు చేయగలరు’అనే స్పూర్తిదాయకమైన క్యాప్షన్‌తో తన బరువు తగ్గక ముందు, తగ్గిన తరువాతి ఫోటోలను జత చేసింది.

https://www.instagram.com/p/B8YNiQFH0pf/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/