మిచెల్‌ స్టార్క్‌పై సానియా సంచలన వ్యాఖ్యలు

ఇక్కడ ఆ పని చేస్తే భార్యకు బానిస అనేవాళ్లు

Sania Mirza and Mitchell Starc
Sania Mirza and Mitchell Starc

హైదరాబాద్‌: ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడిన ఆస్ట్రేలియా ఫైనల్‌లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో తన భార్య ఎలీసా హేలీ ఆటను చూసేందుకుగానూ ఆస్ట్రేలియా పురుషుల స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకుని మరీ వచ్చాడు. అయితే ఈ విషయంపై భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించింది. అంతేకాదు, స్టార్క్‌పై సరదా వ్యాఖ్యలు కూడా చేసింది. స్టార్క్‌ చేసిన పనికి ఉపఖండంలో(భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌) అయితే అతడిని జోరూ కా గులాం అంటే భార్యకు బానిస అనేవారని ట్వీట్‌ చేసింది. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను స్టార్క్‌ కనుక ఉపఖండానికి చెందిన వ్యక్తి అయితే మరు క్షణంలోనే భార్యకు బానిస అని అనేవారు. స్టార్క్‌ మంచి పనిచేశాడు. అని సానియా పేర్కొంది. అయితే గతంలో తన భర్తతో ఆమె ఎదుర్కొన్న పరిణామాల కారణంగానే ఇలా అని ఉండొచ్చునని భావన.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/