ఆరంభంలోనే అదిరిన సానియా

Sania Mirza
Sania Mirza

హోబర్ట్‌: చాలా కాలం విరామం తీసుకున్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్‌ ఆరంభంలోనే అదరగొట్టింది. సానియా బిడ్డకు జన్మనిచ్చిన తరువాత రెండేళ్లు ఆటకు దూరంగా ఉండిపోయింది. అయితే మంగళవారం హోబర్ట్‌ ఇంటర్నేషల్‌ టోర్నీలో మాత్రం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నడియా కిచెనోక్‌తో జత కట్టిన సానియా, ఒక్సానా కలష్నికోవా(జార్జియా), మియు కటొ(జపాన్‌) ద్వయంపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక గంటా 41 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా విజృభించింది. తర్వాతి మ్యాచ్‌లో సానియా జంట అమెరికా జోడి వనియా కింగ్‌, క్రిస్టినా మెక్‌హేల్‌తో తలపడింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి నాలుగో సీడ్‌ జార్జినా గ్రేసియా పెరెజ్‌, సారా సొరిబెస్‌ టొర్మొకు గట్టి పోటీ నివ్వడం తుది మెరుపు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/