పారిస్‌ నగరం లో సానియా

సోదరి బ్యాచిలర్ పార్టీ పారిస్‌ లో ఏర్పాటు

పారిస్‌ నగరం లో సానియా
Saniya on Paris Streets

పారిస్: భారత స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం పారిస్‌ వీధుల్లో నగర అందాలను తనివితీరా ఆస్వాదిస్తోంది. సోదరి ఆనమ్‌ మీర్జా తన బ్యాచిలర్‌ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే ఈ బ్యాచిలర్‌ పార్టీలో సానియా మీర్జా హైలెట్‌గా నిలిచారు. పార్టీ అనంతరం ఇద్దరు సోదరీమణులు పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొట్టారు. వీధి వీధి తిరుగుతూ అక్కడి నగర అందాలను ఆస్వాదించారు.ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో పంచుకున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండిhttps://www.vaartha.com/news/movies/