శాండ్విచ్ సఫ్రాన్

శాండ్విచ్ సఫ్రాన్
బ్రెడ్‌ని యధాతథంగా తినమని చెప్తే పిల్లలు ముఖం చిట్లిస్తారు. దానితో ఏదైనా వంటకం చేస్తే ఇష్టంగా తింటారు.
కావలసినవి బ్రెడ్ స్లైసులు-12 మవ మిశ్రమం కోసం, 150 గ్రా. మవ క్రీము-రెండు స్పూన్లు మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ చిక్కీ-50గ్రా కుంకుమపువ్ఞ్వ సాస్‌కోసం అరలీటరు పాలు రెండు గ్రాములు పాలలో నానపెట్టిన కుంకుమపవ్వు మొక్కజొన్నపిండి-ఒకటిన్నర స్పూన్ పంచదార, జీడిపప్పు, బాదం పప్పులు పలుకులు కొద్దిగా
తయారుచేసే విధానం
బ్రెడ్ ముక్కల్ని త్రికోణాకారంలో కట్ చేయాలి. చిక్కిని చిదమాలి. పంచదార కలిపి పాలు వేడిచేయాలి. పాలు మరగడం మొదలు కాగాన్ స్టవ్ మంట తగ్గించి మొక్కజొన్నపిండి కలిపి చిక్కబడేవరకూ తిప్పుతూ ఉండాలి. స్పూన్‌తో తీసేలా చిక్కబడ్డాక దించేసి కుంకుమ పువ్వు కలపాలి.
మవ మిశ్రమం: మవను మీగడను కలపాలి. చిక్కి మిశ్రమం కలపాలి. దాన్ని బ్రెడ్ ముక్కల మధ్య ఉంచాలి. శాండ్విచ్లను వెడల్పాటి పాత్రలో ఉంచి దానిపైన కుంకుమపువ్ఞ్వ మిశ్రమం పోయాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక కుంకుమపూలతో, డ్రైఫ్రూట్స్‌తో అలంకరిస్తే పిల్లలకి చూడడానికి కంటికి ఇంపుగా, నోటికి రుచిగా కూడా ఉంటుంది.