సంచయిత గజపతిరాజకు కీలక పదవి

104 ఆలయాలకు చైర్మన్‌గా సంచయిత…ప్రభుత్వం ప్రకటన

sanchita gajapathi raju

అమరావతి: ఏపి ప్రభుత్వం మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజుకు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్‌గా కీలక పదవిని అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 2న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ఆలయంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో చైర్మన్‌గా సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆనందగజపతిరాజు వారసురాలిగా సంచయితను చైర్మన్‌గా నియమించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27న లేఖ రాసింది. రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న 104 ఆలయాలకు సంచయిత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/