సంయుక్త కిసాన్ మోర్చా నేత‌లు ప్ర‌త్యేక స‌మావేశం

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్‌లో నూతన సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ బిల్లు పాసైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కిసాన్ మోర్చా నేత‌లు ఇవాళ స‌మావేశం అవుతున్నారు. సింఘు స‌రిహ‌ద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేత‌లు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. వ్యవసాయ చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ పై సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రైతులపై నమోదయిన కేసుల ఎత్తివేత, పరిహారం కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న రైతు డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణ పై నేటి సమావేశంలో సంయుక్త కిసాన్ మెర్చా నేతలు చర్చించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/