శామ్‌సంగ్‌ యూజర్స్‌కు చేదువార్త

Netflix
Netflix

హైదరాబాద్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ శామ్‌సంగ్‌ యూజర్స్‌కి షాకిచ్చింది. డిసెంబరు 1 నుంచి కొన్ని శామ్‌సంగ్‌ టీవీ మోడల్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు శామ్‌సంగ్‌ ఒక ప్రకటన చేసింది. వివిధ సాంకేతిక కారణాలతో డిసెంబరు 1 నుంచి శామ్‌సంగ్‌ పాతతరం స్మార్టు టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ పనిచేయదు. 2010-11లో తయారైన కొన్ని మోడల్స్‌ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఆగిపోయింది. టీవీల స్క్రీన్‌ సైజు పక్కన సీ, డీ అనే అక్షరాలు ఉండే టీవీలకు మాత్రమే సేవలు ఆగిపోతాయి. గేమింగ్‌ కన్పోల్‌, స్ట్రీమింగ్‌ మీడియా ప్లేయర్‌, సెట్‌టాప్‌ బాక్స్‌ ఉన్నవారు పాత టీవీలలో నెట్‌ఫ్లిక్స్‌ వీక్షించే అవకాశం ఉంది. శాంసంగ్‌తో పాటు రోకూ డివైజ్‌లలోనూ నెట్‌ఫ్లిక్స్‌ సేవలు ఆగిపోననున్నట్లు తెలుస్తుంది. రోకు2050ఎక్స్‌, రోకు2100ఎక్స్‌, రోకు2000సి, రోకుహెచ్‌డి ప్లేయర్‌, రోకు ఎస్‌డి ప్లేయర్‌, రోకు ఎక్స్‌ఆర్‌ ప్లేయర్‌ మరియు రోకుఎక్స్‌డి ప్లేయర్‌ మోడళ్లలో కూడా నెట్‌ఫ్లిక్స్‌ పనిచేయదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
్జ