ఉద్యోగులను తొలగిస్తున్న శామ్‌సంగ్‌

Samsung
Samsung

న్యూఢిల్లీ: గతంలో భారత మొబైల్‌ మార్కెట్లో దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్‌ అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు చైనా ఫోన్ల రాకతో ఇతన దేశాల కంపెనీలు, శామ్‌సంగ్‌ డీలా పడ్డాయి. అయితే నా కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా ఆదాయంలో కోతపడటంతో శామ్‌సంగ్‌ ఖర్చుల హేతుబద్ధీకరణకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఉద్యోగులను తగ్గించుకుంటోంది. కాగా ఇప్పటికే టెలికాం నెటవర్క్స్‌ డివిజన్‌ నుంచి 150 మంది దాకా ఉద్యోగులను తీసేశారట. ఈ ఏడాది అక్టోబరు నాటికి 1000 మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/