నెక్ట్స్‌జెన్‌ టెక్నాలజీపై శాంసంగ్‌ భారీ పెట్టుబడులు

ఎల్‌సిడి డిస్‌ప్లేలకు 11 బిలియన్‌ డాలర్లవ్యయం

samsung
samsung

న్యూఢిల్లీ: దక్షిణకొరియా ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ 11 బిలియన్‌ డాలర్లను భావితరం టెక్నాలజీలకోసం ఖర్చుచేస్తోంది. ప్రత్యేకించి చైనా పోటీ కంపెనీల తాకిడిని కట్టడిచేసి వాటిని అధిగమించేందుకు కొత్త వ్యూహాలనుఅనుసరిస్తోంది. ఎల్‌సిడి మేకింగ్‌సామర్ధ్యాన్ని మరింతపెంచుకుంటూ వస్తోంది. కొరియా కరెన్సీలో చూస్తే 13.1 లక్షలకోట్ల వాన్‌లు అంటే 11 బిలియన్‌ డాలర్లు భావితరం ఎల్‌సిడి డిస్‌ప్లేల తయారీకి ఖర్చు చేయాలని నిర్ణయించింది. కొరియా అధ్యక్షుడు మూన్‌జా§్‌ు ఇన్‌, శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ఛైర్మన్‌ జే వై లీ లు పాల్గొన్న పెట్టుబడుల సదస్సులో ఈ అంశం ప్రకటించారు. శాంసంగ్‌ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడేందుకు వీలుగా కొరియా కంపెనీ ఇపుడు కొత్త పెట్టుబడులతోముందుకువస్తోంది. దక్షిణకొరియా అధ్యక్షుడుసైతం ప్రభుత్వం భావితరం డిస్‌ప్లేలు ప్రోత్సహించేందుకు 400 బిలియన్‌ యువాన్లను ఖర్చుచేస్తోందని వెల్లడించారు. ఇప్పటివరకూ శాంసంగ్‌ క్వాంటమ్‌డాట్‌ డిస్‌ప్లేను అసన్‌లో ఉత్పత్తిచేస్తోంది.

2021నుంచి కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలతో వస్తుందని, ప్రాథమికంగా వారిషక ఉత్పత్తి 30వేల ప్యానెల్స్‌ వరకూ ఉంటుందని అంచనావేసింది. ప్రాథమికంగా 65 అంగుళాలకంటే పెద్దస్థాయి డిస్‌ప్లేలను ఉత్పత్తిచేస్తామని, దీర్ఘకాలికంగా అభివృద్ధి ప్రణాళికను కూడా అమలుకు తెచ్చి 2025 నాటికి పూర్తిస్థాయిలో డిస్‌ప్లేల ఉత్పత్తిని పెంచుతామని అన్నారు. ఇందుకుఓసం కొత్తగా 81 వేల మందికి ఉద్యోగాలుసృష్టిస్తామని కంపెనీ వెల్లడించింది. శాంసంగ్‌ పోటీ కంపెనీఎల్‌జి డిస్‌ప్లేకంపనీ కూడా చైనా సరఫరాదారులనుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నది. చైనానుంచి వస్తున్న బిఒఇ టెక్నాలజీగ్రూప్‌ కంపెనీ ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా సరఫరాచైన్‌ ఏర్పాటుచేసుకుంది. భావితరం స్క్రీన్‌ల ఉత్పత్తికి ప్రణాళికలు మరింత ముమ్మరంచేసింది. అదేస్థాయిలో శాంసంగ్‌ చుక్కలు ఉన్న స్క్రీన్‌లను మరింతగా పెంచుతోంది. అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లతో ఇపుడు కొరియా కంపెనీలు అత్యధికంగా లాభపడుతున్నాయి. ఇదే అదునుగా తీసుకుని దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం మరింతగా లాభపడాలని ప్రణాళికలు అమలుచేస్తోంది. ఇందులోభాగంగానే ఇపుడు డిజిటల్‌ డిస్‌ప్లే ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/