శాంసంగ్‌ గెలాక్సీ ఈవెంట్‌: పాప్‌ అప్‌ కెమెరా ఫోన్‌

ముంబై : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌పై వేగం పెంచింది. ఇటీవల ఎ,ఎం సిరీస్‌లలో ఇటీవల గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్‌ వచ్చే నెలలో మరో శాంసంగ్‌ గెలాక్సీ బిగ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నామని వెల్లడించింది. ఏప్రిల్‌ 10న ఈ ఈవెంట్‌ జరగనుందంటూ శాంసంగ్‌ ట్వీట్‌ చేసింది. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ఈవెంట్‌పై పరిశ్రమ వర్గాల్లో పలు అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రీమియం మిడ్‌రేంజ్‌లో పాప్‌ అప్‌ కెమెరాతో ఏ90ను గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. బ్యాంకాక్‌, మైలాన్‌, సావోపోలోలో ఒకేసారి వీటిని లాంచ్‌ చేయనుందని భావిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ20 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. దీంతో పాటు ఏ40, ఏ20ఇలను కూడా తీసుకురానుందట. ఇటీవల ఇండియన్‌ మార్కెట్లో ఏ30,ఏ50,ఏ10 స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన సంగతి విదితమే.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :