శామ్‌సంగ్‌ మడతపెట్టే ఫోన్‌

samsung foldable smartphone
samsung foldable smartphone


శాన్‌ఫ్రాన్సిస్కో: శామ్‌సంగ్‌లో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న కార్యక్రమంలో దక్షిణ కొరియా సంస్థ శామ్‌సంగ్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీనిని మడతపెట్టినపుడు 4.6 అంగుళాల డిస్‌ప్లే, ఫోన్‌ను తెరిస్తే 7.3 అంగుళాల ట్యాబ్‌గా వాడుకోవచ్చు. దీని ప్రారంభ ధర 1,980 డాలర్లు కాగా, భారత కరెన్సీలో దాదాపు రూ. 1,40 లక్షల పైమాటే. 512 జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12 జిబి ర్యామ్‌, 4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం, ఈ ఫోన్‌లో ఆరు కెమెరాలున్నాయి. వెనుకవైపు 16 మెగాపిక్సల్‌తో ఒక కెమెరా, 12 మెగా పిక్సల్‌తో రెండు కెమెరాలు, ముందువైపు మూడు కెమెరాలుండగా, ఫోన్‌ను మడత పెడితే రెండు లోపలికి వెళ్లిపోతాయి. 10 మెగాపిక్సల్‌తో సెల్ఫీ కెమెరా ఉంటుంది.