శామ్‌సంగ్‌లో మరో నూతన మడతబెట్టే ఫోన్‌

Galaxy Fold Samsung
Galaxy Fold Samsung

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: శామ్‌సంగ్‌ గెలాక్సీపోల్డ్‌ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో చిందులేస్తున్నాయి. ఇదిఇలావుండగా శామ్‌సంగ్‌ మరొ నూతన మోడల్‌ మడతబెట్టే ఫోనును విడుదల చేస్తున్నట్లు అమెరికాలో జరుగుతున్న శమ్‌సంగ్‌ డెవలపర్స్‌ సదస్సులో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇంతకముందు వచ్చిన గెలాక్సీ ఫోడ్డ్‌ మోడల్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. అయితే గతంలో వచ్చిన ఫోనును అడ్డంగా మడతపెట్టవచ్చు. పూర్తిగా తెరిచినప్పుడు ట్యాబ్‌లాగా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు విడుదలచేయబోయే నూతన మోడల్‌ పొడవాటి డిసిప్లే నిలువుగా మడతబెట్డే విధంగా తయారు చేస్తున్నట్లు శామ్‌సంగ్‌ కంపేని తెలిపింది. దీనిని మడతబెట్టినప్పుడు చేతిలో ఒదిగిపోయేలా.. తెరిచినప్పుడు పొడవాటి డిసిప్లేతో ఆకర్షించేలా వుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విడుదలచేయలేదు. మోడల్‌నెంబర్‌ ఎస్‌ఎం-ఎఫ్‌700ఎఫ్‌గా పిలిచే ఈ ఫోన్‌ 256జీబీ అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తుంది.

తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/