మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర

భక్తులతో కిక్కిరిసిన వనం

Sammakka, Saralamma Mahaajatara
Sammakka, Saralamma Mahaajatara

Medaram: తెలంగాణ మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఇవాళ ప్రారంభమవుతోంది. బుధవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది. కాగా మహా జాతరలో మంగళవారం తొలి ఘట్టం జరిగింది. పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు పూర్తయింది. ఇవాళ సారలమ్మ, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తి అవుతుంది. 17వ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నారు. ఇదే చాల కీలక ఘట్టం. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టమిది . చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొననున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/