సమ్మక్క సారలమ్మ జాతర

Medaram Sammakka Sarakkaa Jatara
Medaram Sammakka Sarakkaa Jatara


మేడారం: సమక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి (పూర్వపు వరంగల్‌ జిల్లా, తాడ్వాయి మండలం) చెందిన మేడారం గ్రామంలో జరిగే ఓ గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరౌతారని అంచనా. ఈ జాతర వరంగల్‌ జిల్లా నుంచి 110 కిలో మీటర్లు ఉంటుంది. ఈ జాతర దట్లమైన అడవులు, కొండలు కోనల మధ్య ఈ చారిత్రాత్మక జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదల ఉన్న వారిని ఆదుకునే ఆపధ్భాందావులుగా, యావత్‌భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క సారలమ్మ దేవతలు. ఈ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా.. దేశం నలుమూలలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 1996లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ జాతరను గుర్తించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/