గుట్ట నుండి గద్దెకు చేరిన సమ్మక్క

అంగరంగ వైభవంగా మేడారంలో సమ్మక్క, పగిడిద్దరాజుల పెళ్లి

medaram
medaram

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కాగా గురువారం రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకుంది. సమ్మక్కను చిలకలగట్టు నుంచి మేడారం గద్దెపైకి చేర్చడానికి ప్రధాన పూజారులు గురువారం ఉదయం 3 గంటల నుంచే పూజలు చేసే ప్రధాన ఘట్టాన్ని చేపట్టారు. చిలకలగట్టు వద్ద ఉన్న సమ్మక్క దగ్గరికి వెళ్లిన పూజారి చీర, సారే, పసుపు, కుం కుమను ఇచ్చి కంకవనాన్ని తీసుకొని గద్దెకు చేర్చారు. మ ధ్యాహ్నం వరకు మొదటి ఘట్టం పూర్తిచేసుకున్న ప్రధాన పూ జారులు సమ్మక్కను గద్దెకు చేర్చే ప్రధాన ఘట్టం పూజను సా యంత్రం 5 గంటలకు మొదలుపెట్టారు.

సమ్మక్క రాక కోసం మేడారంలో ఉన్న భక్త కోటి జనం లక్షలాదిగా చిలకలగట్టు ప్రా ంతానికి చేరుకున్నారు. సమ్మక్కను ఆహ్వానించడానికి ప్ర భుత్వ పరంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ కర్ణన్, ఎస్‌పి సంగ్రామ్‌సింగ్ లు చిలకలగట్టు గుడి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు చిలకలగట్టుపై పూజలు చేసిన ప్రధాన పూజారి సమ్మక్క కుంకుమ భరిణి, ముక్కుపోగు కమ్మలతో సమ్మక్కను తీసుకొని గుట్ట దిగాడు. అక్కడే ప్రధాన పూజారి కోసం వేచి చూస్తున్న సహ పూజారులు ప్రధాన పూజారికి చుట్టూ రక్షణ వలయంగా నిలిచారు. ఆయనకు మరో వలయంగా ఆదివాసీ తుడుందెబ్బ యూత్ వలయాన్ని కట్టింది. పోలీస్ శాఖ రోప్‌వే ప్రధాన పూజారుల చుట్టూ వలయాకారంలో రక్షణ కల్పించింది. చిలకలగట్టుకు సమ్మక్క రాక కోసం లక్షలాదిగా వచ్చిన భక్తజనం సమ్మక్క ప్రధాన పూజారిని తాకడం కోసం ప్రయత్నాలు చేశారు.

పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో భక్తులెవరిని దగ్గరకు రానివ్వడం లేదు. సమ్మక్కను గద్దెకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ లాంఛనాలను అధికారులు ప్రారంభించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ కర్ణన్ సమ్మక్కకు ఆహ్వానం పలుకగా, ఎస్పి సంగ్రామ్‌సింగ్ గాలిలోకి ఎకె 47తో మూడుసార్లు కాల్పులు కాల్చారు. దీంతో సమ్మక్క వనప్రవేశాన్ని వీడారు. అక్కడి నుంచి ప్రారంభమైన సమ్మక్క మహా ర్యాలీ మేడారంవైపు కదిలింది. అడుగడుగునా భక్తులు పొర్లుదండాలతో కోళ్లు, మేకలతో ఎదురొస్తూ జంతుబలిని చేస్తున్నారు. సమ్మక్క ర్యాలీలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సమ్మక్కను తీసుకొచ్చారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/