రాజధానికి చేరుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

Samjhauta Express
Samjhauta Express

న్యూఢిల్లీ: సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు పాక్‌ అధికారులు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఎట్టకేలకు ఢిల్లీ చేరుకుంది. షెడ్యూల్‌ సమయాని కంటే 4.30 గంటలు ఆలస్యంగా ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ రైలు దేశ రాజధానికి వచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. భారత భూభాగంలోకి వచ్చేందుకు పాక్‌ సిబ్బంది నిరాకరించడంతో గురువారం ఈ రైలు వాఘా సరిహద్దులో నిలిచిపోయింది. దీంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం భారత రైల్వే అధికారులు ఒక ఇంజిన్‌, సిబ్బందిని పంపి రైలును అటారికి తీసుకొచ్చారు. అలా భద్రతాసిబ్బంది సంరక్షణలో నిన్న రాత్రి అటారీ చేరుకున్న సంఝౌతా రైలు తనిఖీల అనంతరం ఈ తెల్లవారుజామున ఢిల్లీ బయల్దేరింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ స్టేషన్‌ చేరుకుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/