ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న సమంత

అక్కినేని నాగచైతన్య మాజీ భార్య , నటి సమంత..తాజాగా ఉత్తమ అవార్డు దక్కించుకుంది. ఓటిటి ఫిలిం “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో అద్భుతమైన నటనను కనపరిచి ఆకట్టుకునే ఈమెకు ..ఆ పాత్రకు గాను ఉత్తమ ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డు దక్కించుకుంది. సంక్లిష్టమైన రాజి పాత్రను పోషించినందుకు సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. ముంబై వెళ్లి అవార్డుల వేడుకలో ఈమె పాల్గొంది.

ప్రస్తుతం సామ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఏ మాయ చేసావే’, ‘ఈగ’, ‘నీతానే ఎన్ వసంతం’ చిత్రాలకు ఉత్తమ నటిగా గెలుచుకుంది. ఇప్పుడు నార్త్ లోనూ ఆమె బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకోవడం పట్ల అభిమానులు , సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.