సమంత జీవితంలోకి మరొకరు..

టాలీవుడ్ నటి , అక్కినేని కోడలు సమంత జీవితంలోకి మరొకరు వచ్చారు. ఆ వచ్చేది ఎవరో తెలుసు ఓ కుక్క పిల్ల. సమంత కు కుక్కలంటే ఎంతో ఇష్టం..ఖాళీ సమయం దొరికితే తాను పెంచుకుంటున్న కుక్క తో గడుపుతుంటుంది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులకు తన కొత్త కుక్కను పరిచయం చేసింది. దానికి సాషా అని పేరు పెట్టింది. కుక్క తల్లి హ్యాష్ కూడా ఆ పిక్స్ కన్పిస్తోంది. ఈ రెండు కుక్కలను సమంత పెంచుకుంటోంది. అయితే ఈ కొత్త అతిథి తనను బాగా ఇబ్బంది పెడుతోందని.. ఈ ఉదయం నుండి సాషా మూత్రాన్ని 19 సార్లు శుభ్రం చేశానని, సాషా ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ కూడా తాగనివ్వడం లేదంటూ పోస్ట్ చేసింది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం అనే మూవీ చేస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో అల్లు అర్జున్ కూతురు అర్హ ఓ పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఇక సామ్ పర్సనల్ విషయానికి వస్తే..గత కొద్దీ రోజులుగా చైతు తో విడాకులు తీసుకుంటుందనే వార్తలు వైరల్ గా ప్రచారం అవుతున్నాయి. వీటిలో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా చెపుతున్నప్పటికీ..పూర్తిగా మాత్రం ఖండించడం లేదు. ఈ మధ్య నాగ్ బర్త్ డే వేడుకల్లోనూ కనిపించకపోవడం , సామ్ మాత్రమే గోవా టూర్ కు వెళ్లడం తో విడాకుల వార్తల్లో నిజం ఉందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.