కాలినడకన శ్రీవారిని దర్శంచుకున్న సమంత

Samantha
Samantha

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రముఖ సినీ నటి సమంత అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రెండు గంల్లోనే మెట్లు ఎక్కి ఆశ్యర్య పరిచారు. తరువాత నాగచైతన్య, సమంత దంపతులు శ్రీవారిని దర్శంచుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఖమజలీగ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరితో పాటు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు.


మరిన్ని తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/