విడాకుల ప్రకటన తర్వాత సామ్ చేసిన పోస్ట్ ఇదే..షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి

అక్టోబర్ 02 అక్కినేని అభిమానులు మరచిపోలేని రోజు. ఎందుకంటే ఆ రోజున నాగ చైతన్య – సమంత లు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన రోజు. ఇది ఎప్పటికి మరచిపోలేని రోజు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ పెద్దగా నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలలో తెలిపారో అంత షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇదే చర్చ కొనసాగుతుంది. అసలు ఎందుకు వీరు విడిపోయారు..దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సమంతా తన ఇన్‌స్ట్రాగమ్‌లో ఓ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది. ‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. బద్దకం వదిలి ముందుకు నడవాలని..తనకు తానే రక్ష అనే భావాన్ని అంతర్లీనంగా పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటె చైతు – సమంత లు విడిపోవడానికి అమీర్ ఖాన్ కారణం అంటూ బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా చెప్పడం మరో చర్చ గా మారింది. వీరికి , అమీర్ కు సంబంధం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.