సామ్ నుండి మరో హాట్ స్టిల్ ..

విడాకుల తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను అలాగే ఫోటో షూట్స్ లలో కూడా అందాల ఆరబోత చేస్తూ అబ్బా అనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షోతో సెగలు పుట్టిస్తుంది. ఈ మధ్య క్లోతింగ్ బ్రాండ్ షూట్ లో భాగంగా పొట్టిపొట్టి దుస్తుల్లో నెట్టింట రచ్చ చేయగా..ఇప్పుడిప్పుడే ఆ రచ్చ లోనుండి నెటిజన్లు బయటకు వస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ పిక్ లో సమంత తొడలు కనిపించేలా క్రాప్డ్ టాప్ ధరించి స్కిన్ షోలో కనువిందు చేసింది. కిల్లర్ ఎక్స్ప్రెషన్స్ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయని చెప్పాలి. సామ్ టోన్డ్ ఫిజిక్ ను ప్రదర్శిస్తున్న ఈ ఫోటో చూసి ఫాలోయర్స్ , అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘కణ్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సుమంత.. ‘యశోద’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తోంది. ఆగష్టు 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అలానే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే ప్రేమ కథా చిత్రంలో నటిస్తోంది. ఇది ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.