‘ఊ అంటావా మావ’ పాట వస్తే సమంతనే గుర్తుకొస్తుంది ..

‘పుష్ప’ మొదటి భాగం ‘పుష్ప ది రైజ్ ‘ ఐటెం సాంగ్ పై స్టార్ బ్యూటీ కామెంట్స్

Samantha comments on 'Pushpa the Rise' item song
Samantha comments on ‘Pushpa the Rise’ item song

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ లో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ ‘ సాంగ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఊ అంటావా మావ పాటకి ప్రజలు చూపిస్తున్న ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు”.అంటూ పేర్కొంది.

‘ఊ అంటావా మావ’ పాట వస్తే కేహాలు అందరికీ సమంతనే గుర్తుకు వస్తోంది. అంతగా ఈ సాంగ్ సక్సెస్ అయింది. ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. .. మొదట్లో ఈ పాటలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. కమిట్ అవ్వాలా? లేదా? అని చాలాసార్లు ఆలోచించా..’ అయితే ఈ పాట పెద్ద సక్సెస్ అవుతుందని దర్శకుడు సుకుమార్., సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ముందే ఊహించారు. అందుకే ఈ పాటలో నటించే అవకాశం కల్పించారు. వారికి నా కృతజ్ఞతలు` అంటూ సమంత పేర్కొంది.

ఇక అమ్మడి కెరీర్ విషయానికి వస్తే తాజాగా ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తిచేసింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రంయశోద` మూవీ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/