సమంత ఎంత తెలివిగలదో..అందుకే ముందే ఆ పని చేసింది

మొత్తానికి నాగ చైతన్య – సమంత లు తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. పదేళ్లుగా కలిసి స్నేహంగా ..ప్రేమగా ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఐదేళ్లకే విడిపోయారు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారని మీడియా కోడై కోసింది. ఈ వార్తలను కొంతమంది నమ్మిన..మరికొంతమంది వారు విడిపోవడం ఏంటి అని కొట్టిపారేశారు. అలా కొట్టిపారేసిన వారికే వారు షాక్ ఇచ్చారు.

భార్యాభర్తలుగా విడిపోయినా కూడా తామిద్దరం స్నేహితుల్లానే ఉంటామని నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఏర్పడటానికి కారణం కూడా స్నేహమేనని, ఆ బంధం ఎప్పటికీ అలానే ఉంటుందని వారిద్దరూ పేర్కొన్నారు. అయితే సమంత ఈ విషయం చెప్పే ముందు చాలా తెలివైన పని చేసింది. సమంత తన విడాకుల విషయం మీద ప్రస్థావిస్తూ చేసిన అఫీషియల్ నోట్ కింద కామెంట్ల సెక్షన్లను కోజ్ చేసింది. మామూలుగా అయితే సమంత తన కామెంట్ల సెక్షన్లను క్లోజ్ చేయదు. ఎప్పుడో సారి నెగెటివ్ ట్రెండ్ జరిగిన సమయంలోనే అలా చేస్తుంటుంది. అయితే ఈ విడాకుల విషయంలో కచ్చితంగా నెగెటివ్ కామెంట్లు వస్తాయని ముందే ఈ పనిచేసింది. View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)