ఆ ఒక్క మాటతో విడాకుల ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సమంత

గత కొద్దీ రోజులుగా మీడియా లో నాగ చైతన్య – సమంత విడాకుల వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తన ఇంటిపేరుగా ‘అక్కినేని’ అని తొలగించి కేవలం ‘ఎస్’ అని పెట్టుకోవడంతో చర్చకు దారితీసింది. ఎందుకు మార్చుకుందని మీడియాలో అడిగినా కూడా సమాధానాన్ని సమంత దాటవేసింది. ఇక అప్పటి నుండి ప్రతి రోజు ఏదొక వార్త ప్రచారం అవుతుండడం..అక్కినేని కుటుంబ సభ్యులు కానీ సమంత కానీ స్పందించకపోయేసరికి విడాకుల వార్తలు కోర్ట్ లకు వరకు వీరి వ్యవహారం వెళ్లిందని ప్రచారం వరకు వెళ్ళింది.

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో మీడియా దీనిపై ప్రశ్నించగా కోపంతెచ్చుకుంది. ‘గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బుద్ది లేదా?’ అని ఘాటుగా జవాబు ఇచ్చింది. దీంతో ఈ చర్చ మరింత పెరిగింది. ఈ తరుణంలో సమంత ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ విడాకుల వార్తల ఫై క్లారిటీ ఇచ్చినట్లు అని అర్ధమవుతుంది. సమంత-చైతన్యల మధ్య ఎలాంటి గొడవలు లేవన్న వాదనకు బలం చేకూరుతోంది. అక్కినేని జయంతి సందర్భంగా నాగార్జున చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన సమంత ‘ఇది చాలా అద్భుతంగా ఉంది నాగార్జున మామ’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో సమంత అక్కినేని కుటుంబానికి దూరమవుతుందని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పిందని ఆమె ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

This is so beautiful @iamnagarjuna mama 🥺🙏🤗❤️ #ANRLivesOn https://t.co/Xt6XQ6rhNu— S (@Samanthaprabhu2) September 20, 2021