గోవా బీచ్ లో బికినీ తో చిల్ అవుతున్న సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత లు రీసెంట్ గా విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రయాణం తర్వాత వారిద్దరు కూడా వ్యక్తిగత నిర్ణయాల కారణంగా విడిపోవడం జరిగింది. ఒక విధంగా అభిమానులకు ఇది చేదు అనుభవమే అయినప్పటికీ కూడా చైతన్య, సమంత ఇద్దరూ కూడా వారికీ నచ్చినట్లుగా ఉండడం కోసం విడిపోయారు. ప్రస్తుతం విడాకుల తర్వాత ఇద్దరు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇక సమంత అయితే పూర్తి స్వేచ్ఛ గా చెలరేగిపోతుంది. ఐటెం సాంగ్స్ తో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రీసెంట్ గా పుష్ప లో ఐటెం సాంగ్ లో కుమ్మేసింది.

ఇదిలా ఉంటె తాజాగా ఈ బ్యూటీ గోవా బీచ్ లో బికినీ తో చిల్ అవుతుంది. తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకి పుంజ్‌లతో కలిసి గోవా లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ బీచ్‌, వాటర్స్‌ఫాల్స్‌, ఎస్టేట్స్‌లో సరదాగా తిరుగుతున్నారు. కార్యక్రమానికి తగ్గట్టు కాస్య్టూమ్స్‌ వేసుకునే ఆమె నీటిని చూస్తే బికినీలో దర్శనమిచ్చేస్తుంది. సమంత హడావిడి చూస్తుంటే న్యూ ఈయర్‌కు కూడా అక్కడే ఉండి సెలబ్రేట్‌ చేసుకుంటారని తెలుస్తోంది.